Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Balakrishna: 'రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి

Balakrishna: 'రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి

Chitrajyothy 5 days ago

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'రాముడు - భీముడు' సినిమాను నిర్మించిన నిర్మాత చిట్టూరి వీర వెంకట సత్యనారాయణ (74) అనారోగ్యంతో ఆగస్ట్ 17న కన్నుమూశారు.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన 'రాముడు - భీముడు' 1988లో విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది. ఇందులో సుహాసిని, రాధ హీరోయిన్లుగా నటించారు. చక్రవర్తి సంగీతం అందించారు. ఈ సినిమాకు కె. మురళీమోహనరావు దర్శకత్వం వహించారు.

తెలుగు దేశం పార్టీలోనూ చురుకైన కార్యకర్తగా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ ఆ పార్టీ అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారు. ఆయనకు భార్య గిరిజా కుమారి, కుమారులు వెంకటేశ్వరరావు (నాని), విజయ్ కుమార్ ఉన్నారు. చిట్టూరి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు నిడదవోలు లయన్స్ నేత్రాలయానికి దానం చేశారు. చిట్టూరి మృతికి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, పలువురు గ్రామ పెద్దలు నివాళులు అర్పించారు.

ఇవీ చదవండి:

తప్పు ఒప్పుకున్న లోకేష్.. శభాష్ అన్న బన్నీ

చరణ్ సరసన ధురంధర్ బ్యూటీ.. ఇదెక్కడి కాంబోరా మావా

ఎన్టీఆర్- త్రివిక్రమ్ టైటిల్ మారిందిరో..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy