Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bandla Ganesh: మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం

Bandla Ganesh: మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం

Chitrajyothy 3 weeks ago

'ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది' అని బండ్ల గణేష్ అన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కు సర్జరీ అవసరం అని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆయన అభిమాని, నిర్మాత బండ్ల గణేష్ ఎక్స్ లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. పవన్ భుజానికి జరిగిన గాయం ఇప్పటిది కాదని, గబ్బర్ సింగ్ సమయంలో జరిగిందని వెల్లడించారు.

'నిన్న రాత్రంతా నిద్ర రాలేదు… ఒకటే ఆలోచన…

ఒక సంవత్సరం కాదు… రెండు సంవత్సరాలు కాదు… దాదాపు పదిహేనేళ్లుగా మీరు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటే నా గుండె బరువెక్కిపోయింది. చిన్న పంటి నొప్పి వచ్చినా మనిషి విలవిల్లాడిపోతాడు. అలాంటిది మీరు ఇన్ని సంవత్సరాలు ఆ బాధను చిరునవ్వు వెనుక దాచుకుని జీవించడం నిజంగా అసాధారణం. నాకు ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులు కళ్లముందే కనిపిస్తున్నాయి. గుజరాత్‌లో జరిగిన ఆ ప్రమాదం… గుర్రం మీద నుంచి పడిపోయిన ఆ క్షణం… వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పిన సందర్భం… ఇవన్నీ ఇప్పటికీ నా మనసును వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఒక హీరో తీసుకున్న నిర్ణయం కాదు… మాటకు ప్రాణం ఇచ్చే మహామనిషి తీసుకున్న నిర్ణయం.

"ముందు సినిమా పూర్తి చేద్దాం… నిర్మాతకు ఇబ్బంది కలగకూడదు… ఇన్ని వందల మంది కష్టపడుతున్నారు…" అని మీ శరీరం భరించలేని నొప్పిని గుండెల్లో దాచుకుని, ఆపరేషన్‌ను వాయిదా వేసి, షూటింగ్ పూర్తి చేసి, సినిమా విడుదలయ్యే వరకు మాకు అండగా నిలిచారు. ఒక నిర్మాతగా ఆ రోజున మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు… జీవితాంతం మర్చిపోలేని ఋణం. ఆ ఋణాన్ని నేను ఏ జన్మలోనూ తీర్చలేను. ఈ రోజు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఆ రోజున మీ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానేమో… కానీ ఈ రోజు ఆ బాధ ఎంత పెద్దదో అర్థమవుతోంది. దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను… మీరు అనుభవించిన ప్రతి నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు… నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో. మీరు ఆరోగ్యంగా నవ్వుతూ ఉండటమే… మీపై ప్రేమ ఉన్న మా అందరికీ అతిపెద్ద సంతోషం" అని పోస్టులో పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ భుజాల కండరాలు చిట్లడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఆయన సోమవారం సతీమణి అన్నా కొణిదెలతో కలసి ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లారు. రెండు భుజాలను పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్‌తో పాటు భుజాల కండరాలు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించారు.

ALSO READ: Ramayana: రామాయణ ట్రైలర్.. ప్రత్యేకత అదే

Director Samudra: డబ్బు వసూలు చేసినా.. పేరు వాడినా.. ఊరుకోను

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy