Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగారం.. సమ్మర్ నుంచి తప్పుకున్నట్లే

బంగారం.. సమ్మర్ నుంచి తప్పుకున్నట్లే

Chitrajyothy 3 weeks ago

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కథానాయికగా నటించిన తాజా చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు నిర్మించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి బంగారమా.. మే 15 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ చెప్తూ వచ్చారు. కానీ, అది జరిగేలా లేదని సమాచారం. సినిమా రిలీజ్ కి ఇంకా పది రోజులు కూడా లేదు.. సామ్ ప్రచారాలను మొదలుపెట్టింది లేదు.

అందుతున్న సమాచారం ప్రకారం మా ఇంటి బంగారం వాయిదా పడినట్లు తెలుస్తోంది. సమ్మర్ నుంచి తప్పుకున్న బంగారం ఎప్పుడు వస్తోంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మే 15 ఎందుకు వాయిదా వేశారు అంటే.. మొదటినుంచి కూడా సమంత.. ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేయడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా ఐపీఎల్ (IPL) కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యపై ప్రభావం పడుతుందని ఆలోచించి వాయిదా వేసినట్లు టాక్. అయితే సమ్మర్ కాకుండా బంగారం రిలీజ్ కి మంచి నెల జూలై అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.

మొదట జూన్ 4 న బంగారం వస్తోంది అని టాక్ నడిచినా.. ఆ డేట్ ని పెద్ది లాక్ చేసేయడంతో సామ్ కి కొత్త డేట్ సమస్య వచ్చింది. జూన్ లో పెద్దితో పాటు లెనిన్ కూడా రిలీజ్ కి రెడీ ఉంది. ఈ రెండు సినిమాల మధ్య బంగారం రావడం కష్టమే. అందుకే సామ్.. జూలైలో రావాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 10 న విశ్వంభర రిలీజ్ అవుతోంది. అది రిలీజ్ అయితే జూలై లాస్ట్ వీక్ బంగారం లాక్ చేసే అవకాశం ఉంది. విశ్వంభర జూలై 10 న కూడా వాయిదా పడితే.. ఆ డేట్ ని మా ఇంటి బంగారం లాక్ చేసే ఛాన్స్ ఉంది. మరి సామ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy