Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భానుడి భగభగ.. భామలు సలసల! కుర్రకారు విలవిల!!

భానుడి భగభగ.. భామలు సలసల! కుర్రకారు విలవిల!!

Chitrajyothy 3 weeks ago

వెండితెరపై వెలిగే తారలు ఏం చేసినా స్టైలిష్ గానే ఉంటుంది. తాజాగా స్టార్ హీరోయిన్స్ వదిలిన ఫొటోషూట్స్ ఇంటర్నెట్‌లో అగ్గి రాజేస్తున్నాయి. ఈ కోవలో తాజాగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela)జీరో సైజ్‌కి మారి యూత్‌ను అట్రాక్ట్ చేస్తోంది.

ఫొటోషూట్ కోసం బ్లాక్ డ్రెస్సులో సరికొత్త గ్లామర్ అవతార్‌తో కనిపించింది. ఇటు బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది. మైండ్ బ్లాక్ చేసే పోజులతో సాన్య మల్హోత్రా,మసూద ఫేం బాంధవి శ్రీదర్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపుతోంది.

ఇదే సమయంలో ట్రెడిషనల్ వేర్ లో రకుల్ ప్రీత్ సింగ్, నభా నటేశ్ కనువిందు చేశారు. చీరకట్టులో రకుల్ వయ్యారాలు ఒలకబోయగా.. పంజాబీ డ్రెస్సులో 'ఇస్మార్ట్' బ్యూటీ ఎంతో క్యూట్‌గా మెరిసిపోయింది. ఓ వైపు సినిమాలు, మరోవైపు పర్సనల్ వర్క్‌తో బిజీగా మారిన ముద్దుగుమ్మలు సింపుల్ లుక్‌లో కనిపించి కనువిందు చేశారు. షూటింగ్స్ మధ్య దొరికిన చిన్న బ్రేక్‌ను కూడా జాలీగా ఎంజాయ్ చేస్తూ కెమెరా కళ్ళకు చిక్కుతున్నారు. స్క్రీన్ పై గ్లామర్ బాంబులా పేలే శ్రుతిహాసన్ రియల్ లైఫ్‌లో తన క్యాజువల్ అండ్ డీసెంట్ లుక్‌లో కనిపించి మాయ చేసింది.

ఇక బిజినెస్, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీగా ఉన్న తమన్నా కూడా ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది. స్టైలిష్ ఔట్‌ఫిట్‌లో కనిపిస్తూనే తన క్యూట్ స్మైల్‌తో అందరినీ కట్టిపడేసింది. మరోవైపు బాలీవుడ్ స్టార్ శ్రద్ధా కపూర్ ముంబై వీధుల్లో ఫొటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కింది. ఎలాంటి మేకప్ లేకుండా క్యాజువల్ లుక్‌లో కనిపించి మైస్మరైజ్ చేసింది. భానుడి భగభగలకు సినీ తారలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. అందుకే షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇచ్చి సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు. కొందరు భామలు చల్లని దేశాలకు చెక్కిస్తే.. మరికొందరు మాత్రం వేసవిలోనూ చెమటలు చిందిస్తూ ఫిట్‌నెస్ మంత్రాన్ని జపిస్తున్నారు.

కీర్తిసురేశ్ లగ్జరీ ఐలాండ్ మారిషస్‌లో వాలిపోయింది. అందమైన లొకేషన్లలో చక్కర్లు కొడుతూ, నీలిరంగు సముద్ర అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతోంది. మరో గ్లామర్ బ్యూటీ వేదిక సైతం ఫ్రాన్స్ కి చెక్కేసింది. ఆహ్లాదకరమైన, చల్లని వాతావరణంలో రిలాక్స్ అవుతూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. కీర్తి, వేదికలు హాలిడే ట్రిప్స్‌లో ఎంజాయ్ చేస్తుంటే.. కృతిససన్ మాత్రం క్యాలరీలను కరిగించుకునేందుకు జిమ్‌లో వాలిపోయింది. కఠినమైన కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy