Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భార్య టార్చర్.. చివరికి రవి మోహన్ ఏం చేశాడంటే..

భార్య టార్చర్.. చివరికి రవి మోహన్ ఏం చేశాడంటే..

Chitrajyothy 4 days ago

క్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాలో వద్దురా.. సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా సాంగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ సాంగ్ లో నాగార్జున.. శివ అనే ఫ్రెండ్ గురించి చెప్తాడు. ఆ ఇల్లాలి భాద పడలేక ముక్తిమార్గం ఎంచుకున్నాడు. సంసారం వద్దని సన్యాసిగా మారాడు అని.. ఇప్పుడు ఆ లైన్స్ కరెక్ట్ గా కోలీవుడ్ నటుడు రవి మోహన్ (Ravi Mohan) కి సరిపోయేలా ఉన్నాయని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.

గత కొన్ని నెలలుగా రవి మోహన్.. తన భార్య ఆర్తితో విడాకుల విషయమై గొడవ పడుతున్న విషయం తెల్సిందే. విడాకులు కావాలని రవి, నాకు తెలియకుండా చేశాడని ఆర్తి.. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. ఇక ఈ మధ్యనే రవి మోహన్ ప్రెస్ మీట్ పెట్టి ఆర్తి టార్చర్ పెడుతోందని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన పిల్లలను తనకు దూరం చేసిందని, కనీసం కాల్ లో కూడా మాట్లాడనివ్వడం లేదని.. స్కూల్ కి బాడీ గార్డ్స్ ని పంపుతుందని చెప్పాడు. ఎంతో వేధిస్తోందని, ఈ బాధ తట్టుకోలేక చెయ్యి కోసుకున్నట్లు తెలిపాడు.

అంతేకాకుండా ఆర్తితో విడాకులు వచ్చేవరకు సినిమాలు చేయనని, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు. ఇక సినిమాలు ఆపేసిన రవి.. భక్తి మార్గం వైపు మళ్ళాడు. ఈ ఇబ్బందుల నుంచి దేవుడే కాపాడాలని ఆయన శబరిమల దీక్షను ప్రారంభించాడు. మానసిక ప్రశాంతత కోసం రవి భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు. తాజాగా రవి మోహన్ శబరిమల దీక్షా మాలను ధరించి, భక్తి మరియు ఆధ్యాత్మిక చింతనకు అంకితమైన తన దీక్షను ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆ అయ్యప్ప స్వామిని నమ్ముకుంటే అంతా మంచి జరుగుతుంది.. రవి మోహన్ కష్టాలు త్వరలోనే తీరిపోతాయని కామెంట్స్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy