Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బికినీలో డ్రాగన్ బ్యూటీ..  షాక్ లో ఫ్యాన్స్

బికినీలో డ్రాగన్ బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్

Chitrajyothy 2 days ago

సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ నెంబర్ 1 స్థానంలో నిలబడాలి అంటే కచ్చితంగా గ్లామర్ గా ఉండాలి. ముఖ్యంగా హీరోయిన్స్ ఏదో ఒక సమయంలో అందాల ఆరబోత చేయక తప్పదు.

పాత్రను బట్టి గ్లామర్ ని ఒలకబోయడం వేరు.. పూర్తిగా గ్లామర్ రోల్స్ చేయడం వేరు. ఇప్పుడున్న హీరోయిన్స్ రెండింటిని అవలీలగా చేసేస్తున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు మొదట్లో పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రల్లో నటించి.. ఆ తరువాత గ్లామర్ రోల్స్ కి సై అంటున్నారు.

తాజాగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ సైతం రూట్ మార్చింది. ఇప్పటివరకు అందాల ఆరబోత చేయని ఆమె.. సడెన్ గా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. అది ఎంతలా అంటే బికినీలో కనిపించి సోషల్ మీడియాను షేక్ చేసింది. 'సప్తసాగరాలు దాటి' అనే సినిమాతో రుక్మిణి ఇండస్ట్రీకి పరిచయమైంది. అమాయకమైన ముఖం.. కళ్ళతోనే హావభావాలు పలికించే ఈ చిన్నదాని అందానికి తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక 'కాంతార 2' లో రుక్మిణి విలనిజాన్ని చూసి అబ్బా ఏమన్నా నటనా... అచ్చం యువరాణిలానే ఉంది అంటూ పిచ్చెక్కిపోయారు.

ఇక 'డ్రాగన్'లో ఎన్టీఆర్ సరసన రుక్మిణి నటిస్తోందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ ఆమెకు గుండెల్లో గుడి కట్టేసుకున్నారు. ఇటు 'డ్రాగన్'తో పాటు.. అటు 'టాక్సిక్'లో కూడా ఈ చిన్నదే హీరోయిన్. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా రుక్మిణి బికినీ షూట్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. గ్రీన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్ లోపలి దిగుతున్నట్లు రుక్మిణి కనిపించింది. చుట్టూ కెమెరా మ్యాన్స్ కూడా ఉన్నారు. దీంతో రుక్మిణి కూడా అందాల ఆరబోతకు తెరతీసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవి నిజమైన ఫొటోసా.. లేక ఏఐనా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారా.. ? వామ్మో.. నిజంగా ఈమె రుక్మిణినేనా అని కామెంట్స్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy