Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Buchibabu Sana: పెద్ది.. ఎన్టీఆర్ కి చెప్పిన కథ కాదు

Buchibabu Sana: పెద్ది.. ఎన్టీఆర్ కి చెప్పిన కథ కాదు

Chitrajyothy 3 weeks ago

ప్పెన సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారాడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana). ఈ సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు. బుచ్చి రెండో సినిమా ఎన్టీఆర్ తో ఉండబోతోందని వార్తలు వచ్చాయి.

కథను కూడా వినిపించాడని.. ఆ కథనే పెద్ది (Peddi) అని టాక్ నడిచింది. ఎన్టీఆర్ కి కథ నచ్చక పెద్దిని వదిలేశాడని కూడా రూమర్స్ వచ్చాయి. ఇక ఎన్టీఆర్ వదిలేసిన కథనే చరణ్ కి వినిపించి పెద్దిగా తెరపైకి తెచ్చినట్లు మాట్లాడుకున్నారు.

ఇక జూన్ 4 న పెద్ది కూడా రిలీజ్ కి సిద్దమయ్యింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన బుచ్చి.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ మరింత హైప్ పెంచుతున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పెద్ది కథపై వస్తోన్న రూమర్స్ కి బుచ్చి చెక్ పెట్టాడు. పెద్ది కథ.. ఎన్టీఆర్ కి చెప్పిన కథ ఒకటి కాదని క్లారిటీ ఇచ్చాడు. ఆ కథ వేరు.. ఈ కథ వేరు అని, ఆయనకు చెప్పిన కథను డెవలప్ చేసుకొని రమ్మన్నారని తెలిపాడు.

'పెద్ది కథకి... నేను ఎన్టీఆర్ కి చెప్పిన కథకి సంబంధం లేదు. ఎన్టీఆర్ కి నేను పూర్తిగా వేరే కథ వినిపించాను. ఎన్టీఆర్ ఆ కథని పూర్తిగా డెవలప్ చేసుకుని తీసుకురమ్మన్నారు. కానీ మధ్యలో పెద్ది అవకాశం రావడంతో.. ఈ సినిమా పనుల్లో బిజీ అయిపోయాను. నా నెక్స్ట్ సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. ఒకవేళ ఎన్టీఆర్ పిలిస్తే కనుక వెళ్ళి కథ వినిపించడానికి నేను రెడీగా ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. దీంతో పెద్ది కథకు ఎన్టీఆర్ కి ఎలాంటి సంబంధం లేదని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఎన్టీఆర్.. బుచ్చికి మరో ఛాన్స్ ఇస్తాడా.. ? లేదా..? అనేది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy