Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Caste Movie: పొలిటీషియన్‌ పాత్రలో రాజా రవీంద్ర

Caste Movie: పొలిటీషియన్‌ పాత్రలో రాజా రవీంద్ర

Chitrajyothy 2 days ago

మధ్య కాలంలో తెలుగులోనూ కాస్ట్ బేస్డ్ మూవీస్ చాలా వస్తున్నాయి. గత యేడాది చివరిలో వచ్చిన 'దండోరా', జనవరిలో మొదటి రోజున వచ్చిన 'వనవీర' కులం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలే.

కమర్షియల్‌గా ఇవి గొప్ప విజయాన్ని సాధించకపోయినా... సినిమారంగంలోనూ, సినీ అభిమానుల్లోనూ ఓ స్థాయిలో చర్చకు అయితే దారి తీస్తున్నాయి. తాజాగా ఎ.కె. జంపన్న రచన చేసి, దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి 'కాస్ట్' అనే పేరే పెట్టారు. దీన్ని తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు.

వరుణ్‌ సందేశ్‌, గగన్, 'సత్యం' రాజేశ్‌, రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'కాస్ట్' మూవీలో ఓ కీలక పాత్రను నాగబాబు పోషిస్తున్నట్టుగా మేకర్స్ తెలిపి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలో మరో కీ-రోల్‌ను ప్రముఖ నటుడు రాజా రవీంద్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ఆయన చేస్తున్న మినిస్టర్‌ నారాయణ పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్‌ చేశారు. తెల్లటి దుస్తులు, భుజంపై పార్టీ కండువా ధరించిన రాజా రవీంద్ర సీజన్డ్ పొలిటీషియన్‌ మాదిరి కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కు చక్కని ఆదరణే లభించింది. ఈ చిత్రంలో కశికా కపూర్, దివి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అతి త్వరలో ప్రకటిస్తున్నామని మేకర్స్ చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy