Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైతూ వైఫ్ శోభితకు అంతర్జాతీయ గౌరవం

చైతూ వైఫ్ శోభితకు అంతర్జాతీయ గౌరవం

Chitrajyothy 1 month ago

టి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) అంతర్జాతీయ గౌరవాన్ని పొందారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన లగ్జరీ బ్రాండ్ 'చార్లెట్ టిల్బరీ' (Charlotte Tilbury)కి మొదటి భారతీయ బ్యూటీ అంబాసిడర్‌గా ఆమె ఎంపికయ్యారు.

అంతర్జాతీయ బ్యూటీ రంగంలో భారతదేశ ప్రాధాన్యతకు ఈ భాగస్వామ్యం ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ భాగస్వామ్యంతో శోభిత.. లూయిస్ విట్టన్ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దీపికా పదుకొణె, గూచీ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలియా భట్ వంటి ఎలైట్ లీగ్‌లో చేరారు. వీరంతా అంతర్జాతీయ బ్రాండ్ల ప్రాతినిధ్యానికి భారతదేశం తరపున ఎంపికై.. అరుదైన గౌరవాన్ని అందుకున్న జాబితాలో ఉన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన మేకప్ బ్రాండ్‌లలో ఒకటైన 'చార్లెట్ టిల్బరీ'తో శోభిత అనుబంధం, అంతర్జాతీయ లగ్జరీ రంగంలో భారతదేశ ఉనికిని మరింత బలోపేతం చేస్తుందని భావించవచ్చు. తనదైన శైలితో, హుందాతనానికి మారుపేరుగా మారిన శోభిత, ఈ భాగస్వామ్యానికి ఒక ప్రత్యేక ప్రామాణికతను తీసుకువస్తారని, గ్లోబల్ బ్యూటీ రంగంలో తన మార్క్ ప్రదర్శిస్తారని ఆమె అభిమానులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక బ్రాండ్ భాగస్వామ్యం మాత్రమే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో స్కిన్ టోన్ విషయంలో మహిళల బ్యూటీకి లభిస్తున్న గుర్తింపుగా, ఒక ఎమోషనల్ మూమెంట్‌గా అంతా భావిస్తుండటం విశేషం.

శోభితా ధూళిపాళ్ల విషయానికి వస్తే.. నటిగా పలు భాషల్లో నటిస్తుండగానే, అక్కినేని హీరో నాగ చైతన్యను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి అనంతరం ఆమె సినిమాలు మానేస్తుందని అంతా అనుకున్నారు కానీ, అలా ఏం జరగలేదు. రీసెంట్‌గా ఆమె నటించిన 'చీకటిలో' అనే చిత్రం విడుదలై మంచి స్పందనను రాబట్టుకుంది. కాకపోతే ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. ఆ తర్వాత ఆమె నుంచి ఎటువంటి ప్రాజెక్ట్ అనౌన్స్ అవ్వలేదు. ఇప్పుడిలా ఒక్కసారిగా అంతర్జాతీయ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి, వార్తలలో హైలెట్ అవుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy