Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Chiranjeevi: 'పెద్ది' ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Chiranjeevi: 'పెద్ది' ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Chitrajyothy 1 week ago

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) రూపొందిస్తున్న 'పెద్ది' (Peddi) చిత్రంపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయి.

ఈ అంచనాలను మరింత పెంచేశారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). అదెలా అనుకుంటున్నారా? మే 18వ తేదీన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందే 'పెద్ది' ట్రైలర్ రివ్యూ (Peddi Trailer Review)ని మెగాస్టార్.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాదు, కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న 'చిరులీక్స్'ని కూడా బయటకు తీశారు. ఇంతకీ చిరంజీవి ఏం పోస్ట్ చేశారంటే..

''పెద్ది ట్రైలర్ చూసాను! జస్ట్ వావ్.. అంతే. 3 నిమిషాలు… ప్యూర్ ఫైర్‌ పవర్ ప్యాక్డ్ ట్రైలర్. చరణ్, బుచ్చి, రెహమాన్.. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు.. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు! ఎంత ఊహించుకున్నా.. దాన్ని మించి ఉంటుంది ఈ ట్రైలర్. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్.. అన్నీ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. అన్నట్టు… చాలా రోజులయ్యింది మీకు చిరులీక్స్ ఇచ్చి'' అంటూ 'పెద్ది' ట్రైలర్‌లోని డైలాగ్‌ని మెగాస్టార్ లీక్ చేశారు.

''మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు...

నేను పోరాడాను సారు...'' అనే డైలాగ్‌ని లీక్ చేసిన చిరంజీవి.. దర్శకుడు బుచ్చిబాబుకు సారీ చెప్పారు. ''Sorry బుచ్చి బాబు… చూసాక కంట్రోల్ తప్పా!'' అంటూ చిరు.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి.. ఫ్యాన్స్‌ని ఊరించేశారు.

అసలే ఎప్పుడెప్పుడా అని ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ ఇచ్చిన లీక్, ట్రైలర్ రివ్యూ చూశాక.. వారిని ఆపడం ఎవరితరం కాదంటే నమ్మాలి. అయినా, చిరంజీవే ఆపుకోలేక పోతున్నారంటే.. ఇక ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఏదిఏమైనా, చిరు లీక్స్, రివ్యూతో.. ఈ సినిమా ట్రైలర్‌పైనే కాదు, సినిమాపై కూడా అమాంతం అంచనాలు డబుల్, త్రిబుల్ అయ్యాయంటే అతిశయోక్తి కానే కాదు. చూద్దాం.. ట్రైలర్ వచ్చాక, మెగాస్టార్ రివ్యూ ఎంత వరకు కరెక్ట్ అనేది. అప్పటి వరకు మాత్రం ఈ హైప్‌తోనే ఫ్యాన్స్ పోయేలా ఉన్నారు. ఇది మాత్రం నిజం.

ఇవి కూడా చదవండి:

Keneeshaa: 4 నెలల బిడ్డను కోల్పోయిన నేను.. జయం రవి జీవితం నాశనం చేస్తానా?

లవ్‌ - రిలేషన్‌పై మిల్కీ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!

మోదీ 'పొదుపు మంత్రం'.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy