ఇటీవల మృతి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవా (Deva) కుటుంబంలో మరో విషాదం జరిగింది. దేవా సోదరుడు సబేష్ కుమారుడు, నటుడు కార్తిక్ సబేష్ (37) (Karthik Sabesh) అనారోగ్యం కారణంగా ఈ నెల 20న మృతి చెందారు.
'వల్లవన్', 'కాదల్ సొల్ల వందేన్', 'పట్టత్తు యానై', 'కులిర్ 100 డిగిరి వంటి పలు చిత్రాల్లో కార్తిక్ నటించారు.
కార్తిక్ పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు అంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. గత యేడాది అక్టోబరులో కార్తిక్ తండ్రి సబేష్ మృతి చెందారు. సరిగ్గా యేడాది తర్వాత అక్టోబరులోనే కుమారుడు కూడా మృతి చెందడం. అదీ కూడా దేవా భౌతికంగా దూరమైన మూడో రోజే ఈ విషాదం జరగడంతో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

