Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డేవిడ్ రెడ్డి కాదు.. రాక్షస్ రెడ్డి

డేవిడ్ రెడ్డి కాదు.. రాక్షస్ రెడ్డి

Chitrajyothy 4 days ago

మంచు వారి వారసుడు మంచు మనోజ్ (Manchu Manoj) కి రీఎంట్రీ బాగా కలిసొచ్చింది. మిరాయ్ సినిమా అతడి కెరీర్ ని మలుపుతిప్పింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.

ఒకపక్క హీరోగా, ఇంకోపక్క విలన్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రాల్లో డేవిడ్ రెడ్డి (David Reddy) ఒకటి. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రిన్స్ సినిమా ఫేమ్ మరియా ర్యబోషప్కా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.

మే 20 న మంచు మనోజ్ పుట్టినరోజు కావడంతో డేవిడ్ రెడ్డి టీజర్ ని రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. బ్రిటిష్ వాళ్ళకు చుక్కలు చూపించే రాక్షసుడిగా మనోజ్ కనిపించాడు. గాంధీ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు వేసిన ఎత్తుగడలను డేవిడ్ రెడ్డి అనే పవర్ ఫుల్ యోధుడు ఎలా అడ్డుకట్ట వేశాడు. అసలు బ్రిటిష్ వాళ్ళు వణికిపోయేలా డేవిడ్ రెడ్డి ఏం చేశాడు..? ఇండియాకు స్వాతంత్య్రం రావడంలో డేవిడ్ రెడ్డి పాత్ర ఎంత.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

మంచి మనోజ్ ఈ సినిమా కోసం బాగా కష్టపడినట్లు కనిపిస్తోంది. నటనలో ఉగ్ర రూపం చూపించాడు. ఇక సినిమాకు హైలైట్ అంటే రవి బసృర్ సంగీతం అనే చెప్పాలి. టోటల్ గా డేవిడ్ రెడ్డి సినిమాపై ప్రేక్షకులు అంచనాలను పెట్టేకొనేలా ఈ టీజర్ ఉంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం దసరా కానుకగా రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రంతో మనోజ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy