Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధనుష్ సరసన కరీనా కపూర్.. సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్

ధనుష్ సరసన కరీనా కపూర్.. సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్

Chitrajyothy 5 days ago

కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush) కి బాలీవుడ్ కొత్తకాదు. తమిళ్, తెలుగు భాషల్లో ఎలా అయితే గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడో హిందీలో కూడా అలాగే వరుస సినిమాలను లైన్లో పెట్టి షాక్ ఇస్తున్నాడు.

గతేడాది తేరే ఇష్క్ మే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్.. ఈ ఏడాది మరో హిందీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ధనుష్ హీరోగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) కాంబినేషన్‌లో ఓ భారీ మైథలాజికల్ జంగిల్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇరుంబు తిరై, సర్దార్ చిత్రాల ఫేమ్ తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ (P.S. Mithran) ఈ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఈ చిత్రంకు సంబంధించిన ఒక వార్తా బాలీవుడ్ మీడియాను షేక్ చేస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ నటింపజేసేందుకు మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో దేవదాస్ సినిమా సమయంలో భన్సాలీ, కరీనా మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా దాదాపు 24 ఏళ్ల పాటు వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. ఇప్పుడు ఈ మైథలాజికల్ జంగిల్ డ్రామా కథ విని కరీనా కూడా నటించడానికి ఆసక్తి చూపినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చర్చలు సఫలమైతే, ధనుష్ సరసన కరీనా కపూర్ నటించడం మాత్రమే కాకుండా, భన్సాలీ ప్రాజెక్ట్‌లో ఆమె కనిపించడం ఇదే తొలిసారి కానుంది.

భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర స్క్రిప్ట్‌ను భన్సాలీ స్వయంగా పలుమార్లు రీరైట్ చేయించి పర్ఫెక్ట్‌గా లాక్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్‌లతో రూపొందిస్తున్న లవ్ అండ్ వార్ చిత్రీకరణ ముగింపు దశలో ఉండగా, ధనుష్-మిత్రన్ మూవీ 2027 ప్రారంభంలో పట్టాలెక్కనుంది. కరీనా ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌పై నేషనల్ వైడ్‌గా భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy