Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డ్రాగన్.. టోవినో వదిలేసింది ఆ పాత్రనేనా

డ్రాగన్.. టోవినో వదిలేసింది ఆ పాత్రనేనా

Chitrajyothy 4 days ago

న్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది అంటూ ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ అర్ధరాత్రి నుంచి సంబరాలు మొదలుపెట్టారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఎన్టీఆర్ నీల్ (NTRNEEL) సినిమా టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేసి ఆయనకు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్.

ఎప్పటినుంచో అభిమానులు అనుకుంటున్న డ్రాగన్ (Dragon) పేరునే టైటిల్ గా అనౌన్స్ చేశారు. మునుపెన్నడూ చూడని లుక్ లో ఎన్టీఆర్ కనిపించాడు. కొంచెం సలార్ పోలికలు ఉన్నా కూడా ఫ్యాన్స్ అవేమి పట్టించుకోకూండా గ్లింప్స్ అదిరిందని చెప్పుకొస్తున్నారు.

ఇక బ్రిటీష్ వాళ్ళు 250 ఏళ్ళు భారతదేశంపై ఆధిపత్యం చెలాయించడానికి హెరాయిన్ కారణమంటూ కథ మొదలయ్యేలా కనిపిస్తోంది... బ్రిటిష్ వాళ్ళు మన దేశం వీడిపోయాక 'నల్లమందు' కోసం రెండు వర్గాలు కొట్టుకోవడమే కథగా చూపించాడు. గ్లింప్స్ లో మొత్తం ఆఫ్ఘన్ డాన్స్ నే చూపించారు. వీరే విలన్స్ అనుకోవడానికి లేదు. ఇదంతా ఒక వర్గం మాత్రమే. వీరందరూ ఒక టీమ్ అనుకుంటే.. అసలు విలన్ గోల్డెన్ ట్రయాంగిల్ టీమ్ లో ఉన్నాడు. వారిని నీల్ ఇంకా పరిచయం చేయలేదు.

అయితే గత కొన్నిరోజులుగా మలయాళ నటుడు టోవినో థామస్.. డ్రాగన్ సినిమాలోని ఒక మంచి పాత్రను వదిలేసినట్లు తెలుస్తోంది. హీరోకు ధీటైన పాత్ర అని, అతను చేస్తే కచ్చితంగా మంచి పేరు వచ్చేదని టాక్. దీంతో గ్లింప్స్ వచ్చిన దగ్గర నుంచి టోవినో వదిలేసిన పాత్ర ఏదై ఉంటుందా అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆఫ్ఘన్ టీమ్ కాకుండా గోల్డెన్ ట్రయాంగిల్ బాస్ పాత్రకు టోవినోని అడిగినట్లు తెలుస్తోంది. టోవినోని ఎదిరించడానికే ఎన్టీఆర్ డ్రాగన్ గా మారతాడని అంటున్నారు. ఆ పాత్ర నచ్చినా.. డేట్స్ లేవని టోవినో తప్పుకున్నాడు. ఇప్పుడు అంత పెద్ద పాత్రలో నీల్ ఏ హీరోని దింపాడు. గోల్డెన్ ట్రయాంగిల్ బాస్ గా ఎవరు కనిపిస్తారు..? అనేది మిస్టరీగా మారింది. మరి నీల్ ఆ పాత్రలో ఎవరిని దింపుతాడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy