Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దృశ్యం 3.. మా వెంకీ మామ చేసి ఉంటేనా

దృశ్యం 3.. మా వెంకీ మామ చేసి ఉంటేనా

Chitrajyothy 4 days ago

సాధారణంగా రీమేక్స్ కంటే ఒరిజినల్స్ చాలా బావుంటాయి అని అంటారు. కానీ, కొన్ని సినిమాలు మాత్రం రీమేక్సే ఒరిజినల్ కన్నా బావుంటుంది అనిపిస్తుంది. అలా అనిపించిన సినిమాల్లో దృశ్యం ( Drishyam) ఫ్రాంచైజీ ముందు వరుసలో ఉంటుంది.

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా జీతూ జోసెఫ్(Jeethu Joseph) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దృశ్యం. ఈ సినిమా అన్ని భాషల్లో రీమేక్ అయ్యింది. తమిళ్ లో కమల్ హాసన్ , హిందీలో అజయ్ దేవగణ్ .. తెలుగులో వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించారు. మిగతా రీమేక్ లు ఏమో కానీ, తెలుగులో వెంకీ మామ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అంటే అతిశయోక్తి కాదు.

మొదటి పార్ట్ మాత్రమే కాదు.. రెండో పార్ట్ కూడా వెంకీ మామ అదరగొట్టాడు. అసలు రాంబాబు పాత్ర వెంకీ మామ కోసమే పుట్టిందా అనిపించింది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కామెడీ, ఎమోషనల్ సీన్స్ లో అయితే వెంకీని కొట్టేవారే లేరు. దృశ్యం 2 తోనే ఈ ప్రాంఛైజీ ఆగిపోతుందేమో అనుకున్నారు. కానీ, జీతూ దృశ్యం 3 కూడా ఉంది అని ప్రకటించినప్పటి నుంచి.. రాంబాబు ఈజ్ బ్యాక్ అని, ఎప్పుడెప్పుడు వెంకీ మామను ఆ పాత్రలో చూద్దామా అని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, వారందరికీ జీతూ షాక్ ఇచ్చాడు. దృశ్యం 3.. రీమేక్ లేదని, మోహన్ లాల్ సినిమానే డబ్బింగ్ వస్తోందని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కానీ, తెలుగువారు.. రాంబాబుకు అడిక్ట్ అయ్యినట్లు జార్జ్ కుట్టికి అడిక్ట్ కాలేకపోయారు.

దృశ్యం 3 తెలుగులో వెంకటేష్ చేయడం లేదు అని తెలిసేసరికి ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో మోహన్ లాల్ దృశ్యం 3 కి తెలుగులో సౌండ్ లేదు. కథ, స్టార్ హీరో ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకులు మాత్రం జార్జ్ కుట్టి మాకొద్దు అని అంటున్నారు. అందుకే ఇప్పటివరకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగలేదు అని టాక్. దీనికి తోడు మోహన్ లాల్ సైతం డబ్బింగ్ వెర్షన్ కి సరైన ప్రమోషన్స్ చేయకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ గా మారింది. అదే దృశ్యం 3 వెంకీ మామ రీమేక్ చేస్తున్నాడు అని చిన్న హింట్ వచ్చినా కూడా ఇప్పటికీ ఒరిజినల్ వెర్షన్ కి కూడా ఫ్యాన్స్ క్యూలు కట్టేవారు. ఏదిఏమైనా జీతూ.. దృశ్యం 3 తెలుగులో డబ్ చేసి తప్పు చేశాడు అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే దృశ్యం 3 మే 21 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమా.. తెలుగు ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy