Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దృశ్యం 4.. ఇంకెంత సాగిదీస్తార్రా బాబు

దృశ్యం 4.. ఇంకెంత సాగిదీస్తార్రా బాబు

Chitrajyothy 15 hrs ago

సాధారణంగా భారతీయ చిత్రసీమలో ఒక సినిమా విజయం సాధిస్తే దానికి సీక్వెల్ రావడం పరిపాటే. కానీ ఆ సిరీస్లు ఒకటి లేదా రెండు భాగాలతోనే ముగిసిపోతుంటాయి.

అత్యంత అరుదుగా మాత్రమే ఏదైనా కథ మూడో భాగానికి చేరుకుంటుంది. అంతకుమించి లీడ్ క్యారెక్టర్లతో ఒక కథను కొనసాగించడం దాదాపు అసాధ్యం. అయితే, ఈ సమీకరణాలన్నింటినీ తిరగరాస్తూ దర్శకుడు జీతూ జోసెఫ్ రూపొందించిన దృశ్యం ఫ్రాంచైజ్ ఇప్పుడు ఏకంగా నాలుగో భాగం (Drishyam 4) నిర్మాణానికి సిద్ధమవుతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దృశ్యం.. ఈ ఫ్రాంచైజ్ నచ్చని ప్రేక్షకుడు ఉండడు. మోహన్ లాల్ హీరోగా మొదలైన ఈ సినిమా అన్నీ భాషల్లో రీమేక్ అయ్యింది. తెలుగులో వెంకటేష్ ఈ సినిమా రీమేక్ చేసి మంచి విజయాలను అందుకున్నాడు. మొదటి రెండు భాగాలు ఓకే కానీ.. మూడో భాగం కేవలం మలయాళంలోనే రిలీజ్ అయ్యింది. తెలుగులో వెంకటేష్ ఈ మూడో భాగాన్ని రీమేక్ చేయడానికి విముఖత చూపడంతో మోహన్ లాల్ వెర్షన్‌నే డబ్బింగ్ చేసి వదిలారు. స్వరాష్ట్రమైన కేరళలో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆదరణ లభించినప్పటికీ, ఇతర భాషల్లో మాత్రం ప్రేక్షకులు పూర్తిగా తిరస్కరించారు. చివరి అరగంటలో ఇచ్చే ట్విస్ట్ కోసం మొదటి రెండు గంటల పాటు కథనాన్ని టీవీ సీరియల్ తరహాలో నిరసనగా నడిపించడం, క్లైమాక్స్ అంతా కన్ఫ్యూజ్ గా ఉండటం వల్ల డిజిటల్, థియేట్రికల్ ఆడియన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇక జీతూ.. ఈ మూడు భాగాలతోనే దృశ్యం ని ముగించనున్నట్లు ముందే తెలిపాడు. మూడో భాగంలో జార్జి కుట్టి.. తన కూతురిని కాపాడడానికి ఆ నిందను తనపై వేసుకొని జైలుకు వెళ్తున్నట్లు చూపించి సినిమాను ముగించారు. దీంతో జార్జి కుట్టి కుటుంబం కథ ముగిసింది అనుకున్నారు. కానీ, ఈలోపే ఈ సినిమాకు నాలుగో భాగం కూడా ఉందని నిర్మాత చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఒక ఈవెంట్ లో నిర్మాత ఆంటోని పెరుంభవర్ దృశ్యం 4 కి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పి షాక్ ఇచ్చాడు. ఈ వార్త తెలియడంతో ప్రేక్షకులు..అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెంత సాగదీస్తార్రా బాబు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ నాలుగో భాగంపై డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఏమంటాడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy