Dailyhunt
Dushara Vijayan: ఖాళీగా కూర్చున్నా అడిగేవారు లేరు

Dushara Vijayan: ఖాళీగా కూర్చున్నా అడిగేవారు లేరు

Chitrajyothy 2 weeks ago

తాను ఏ పని చేయకున్నా, సినిమాల్లో నటించకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నా అడిగేవారు లేరని హీరోయిన్‌ దుషారా విజయన్ (Dushara Vijayan) అన్నారు. ఆర్య నటించిన 'సర్పట్టా పరంబరై'లో మారియమ్మ పాత్ర ద్వారా కోలీవుడ్‌ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న దుషారా..

తాజాగా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ, 'గత ఆరు నెలలుగా ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను.

పనిచేయకపోయినా ఇంట్లో నన్ను అడిగేవారు లేరు. నేను కథలను ఎంచుకోవడం లేదు. కథలే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. మున్ముందు మంచి స్టోరీల్లో నటించేందుకు కృషి చేస్తాను. గత యేడాది కాలంగా నేను నటించిన చిత్రాలు విడుదలకాలేదు. ఈ నెలలో 'ఎగ్జామ్‌' మూవీ విడుదలవుతుంది. త్వరలోనే 'సర్పట్టా పరంబరై-2' (Sarpatta Parambarai-2) ప్రారంభంకానుంది' అని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy