Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఎపిక్' టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

'ఎపిక్' టీమ్‌తో NSR స్పెషల్ ఇంటర్వ్యూ

Chitrajyothy 3 weeks ago

'బేబీ' వంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న తాజా యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ 'ఎపిక్' (Epic).

'90s' వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గోరేటి వెంకన్న పాడిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. ఈ సందర్భంగా ఎన్ఎస్ఆర్ నిర్వహించిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ (NSR Exclusive Interview)లో చిత్ర హీరోహీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పలు ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. 'ఎపిక్' అనేది కేవలం పెద్ద సినిమా లేదా హీరోయిక్ సినిమా అని కాకుండా, ప్రతి సామాన్య కుర్రాడి జీవితంలో ప్రేమ, బాధ్యతల కోసం నిలబడినప్పుడు కలిగే ఒక అద్భుతమైన ఫీలింగ్‌ను సూచిస్తుందని టైటిల్ ఆంతర్యాన్ని వివరించారు. ఈ చిత్రంలో తన పాత్ర శేఖర్ కమ్ముల సినిమాల్లోని అమాయకపు హీరోలా ఉంటే, వైష్ణవి పాత్ర సందీప్ రెడ్డి వంగా హీరోలా ఎంతో క్లారిటీ, బోల్డ్‌నెస్‌తో ఉంటుందని చెప్పారు. నేటి Gen-Z యువత ఆలోచనలకు అద్దం పడుతూనే, లివ్-ఇన్ రిలేషన్‌షిప్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను దర్శకుడు ఆదిత్య హాసన్ ఎంతో బాధ్యతాయుతంగా, నవ్విస్తూనే మనసును హత్తుకునేలా తెరకెక్కించారని తెలిపారు. లండన్ నేపథ్యంలో దాదాపు 50 రోజుల పాటు సాగిన షూటింగ్ ఎంతో పాజిటివ్ వైబ్‌తో ముగిసిందని, హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సంగీతం చిత్రానికి ప్రాణమని ఆనంద్ పేర్కొన్నారు.

ఇక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. 'బేబీ' తర్వాత ప్రతి సినిమా తనకొక నూతన అనుభవాన్ని నేర్పిందని, 'ఎపిక్' షూటింగ్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి ప్రతి క్షణాన్ని అమితంగా ఆస్వాదించానని సంతోషం వ్యక్తం చేశారు. సినిమా మొత్తం ఒక బ్యూటిఫుల్ మెమొరీలా మిగిలిపోయిందని, థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రతి అమ్మాయి తన పాత్రతో రిలేట్ అవుతుందని తెలిపారు. 'బేబీ'లో కన్నీళ్లు పెట్టించిన వీరిద్దరి జోడీ, 'ఎపిక్'లో అద్భుతమైన ఫన్, ఎమోషన్స్‌తో అలరించడానికి సిద్ధమైంది. సితార సంస్థలో వస్తున్న మరో సక్సెస్ ఫుల్ చిత్రంగా 'ఎపిక్' నిలుస్తుందనే ధీమాను టీమ్ వ్యక్తం చేసింది. ఇంకా ఆనంద్, వైష్ణవి చెప్పిన ఆసక్తికర విశేషాలు తెలుసుకునేందుకు పై వీడియో క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

పవర్ స్టార్ బర్త్‌డేకి 'ఓజీ-2' అప్డేట్ ఉంటుందా..

'దాయ్రా'లో డీసీపీ అజూనీ కోహ్లీగా కరీనా.. పవర్‌ఫుల్ పోస్టర్ వైరల్

శంకర్-మురుగదాస్ కాంబోలో మూవీ.. బాక్సాఫీస్ షేకే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy