'పెళ్లి చూపులు' చిత్రం సక్సెస్‌తో దర్శకుడిగా గుర్తింపు పొందారు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker). ఆయన ప్రస్తుతం హీరోగా మారి వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కోవలోనే తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'గాయపడ్డ సింహం' (Gaayapadda Simham). జేడీ చక్రవర్తి (J. D. Chakravarthy), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), మానసా చౌదరి (Maanasa Choudhary) ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లకు వచ్చి ఫర్వాలేదనిపించుకుంది. అయితే జనాలను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షాక్ ఇచ్చింది.
కథ విషయానికి వస్తే.. దరహాస్ దాస్యం (తరుణ్ భాస్కర్) ఎథికల్ హ్యాకింగ్‌లో నిష్ణాతుడు. చిన్ను (మాసన చౌదరి)తో ప్రేమలో పడతాడు. ఆమెతో పెళ్లి జరగాలంటే అమెరికాలో సెటిలై ఉండాలి, డబ్బు బాగా సంపాదించాలని తండ్రి షరతులు పెడతాడు. దాంతో దరహాస్ ఆ అమ్మాయి కోసం అమెరికా వెళ్లడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. తీరా అక్కడికి వెళ్లాక దరహాస్‌తో పాటు కొందరిని ట్రంప్ ప్రభుత్వం డిపోర్ట్ చేస్తుంది. ఇండియాకు వచ్చిన దరహాస్‌కు చిన్ను గుడ్‌బై చెప్పేస్తుంది. అమెరికా లైఫ్, గర్ల్ ఫ్రెండ్‌ను మిస్ కావడంతో రగిలిపోయిన దరహాస్.. ట్రంప్‌పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. భైరవ్ (శ్రీవిష్ణు)తో కలిసి ఓ పన్నాగం పన్నుతాడు. ఈ కథలో శాలిని (ఫరియా అబ్దుల్లా) ఎవరు? ఆమె తండ్రి ఐజీ విజయ్‌కాంత్ (శుభలేఖ సుధాకర్)కు దరహాస్ కు ఉన్న సంబంధం ఏమిటి? బ్రూటల్ ధర్మ (జె.డి చక్రవర్తి) చేసే దందా ఏమిటీ? అన్నది మిగతా సినిమా.

2024లో జరిగే కథ ఇది. అమెరికా నుంచి వెనక్కి వచ్చేసిన ఓ యువకుడు ఆ దేశాధ్యక్షుడిపై క్షక్ష తీర్చుకోవాలన్న నేపథ్యానికి కాస్త వినోదాన్ని జోడించి తెరకెక్కించారు. 'కేజీఎఫ్' స్టైల్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొంటూ పోవడం, బొమ్మరిల్లు సీన్, పోకిరిలో కొన్ని సీన్స్ స్పూఫ్స్ గా చూపించడం నవ్వులు పూయిస్తుంది. భైరవ్‌గా శ్రీ విష్ణు పాత్ర కాస్త వైవిద్యంగా సాగుతుంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video) ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ధియేటర్లలో మిస్సయిన వారు, కాస్త సమయం వేస్ట్ చేయాలనుకునే వారు ఒక్కసారి ఈ 'గాయపడ్డ సింహం' మూవీ చూసేయవచ్చు.

