Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gunasekhar: లోకం పోకడను గమనించి సినిమాలు చేస్తున్నా! నాలుగైదు కథలు సిద్ధం చేశా

Gunasekhar: లోకం పోకడను గమనించి సినిమాలు చేస్తున్నా! నాలుగైదు కథలు సిద్ధం చేశా

Chitrajyothy 4 days ago

నా సినిమాల్లో సాంకేతికత కంటే భావోద్వేగాలకు పెద్దపీట వేయడానికి ప్రయత్నిస్తాను. ట్రెండ్‌ ఆధారంగా కాకుండా లోకం పోకడను గమనించి చిత్రాలను చేస్తుంటా' అని దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) అన్నారు.

'చూడాలని ఉంది', 'ఒక్కడు', 'రుద్రమదేవి' వంటి బ్లాక్‌బస్టర్స్‌ తెరకెక్కించిన ఆయన.. కొంత గ్యాప్‌ తర్వాత ఇటీవలే 'యుఫోరియా'(Euphoria ) తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం సమాజంలోని పరిస్థితులకు అద్దం పడుతూ ఆయన రూపొందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ఆయన 'చిత్రజ్యోతి'తో ముచ్చటించారు.

'యుఫోరియా'ను థియేటర్లలో మిస్సయినందుకు బాధగా ఉందంటూ ఇప్పటికీ కొంతమంది సందేశాలు పంపిస్తున్నారు. ఒక ఫిల్మ్‌మేకర్‌గా ఇది ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ప్రస్తుతం నాలుగైదు కథలు సిద్ధం చేశాను. అందులో ఒకటి పీరియాడిక్‌ డ్రామా అయితే, రెండోది యాక్షన్‌ ప్రధానంగా సాగేది. మూడోది సోషల్‌ మెసేజ్‌ ఇలా ఉంటాయి. నాలుగో కథకు తుదిమెరుగులు అద్దుతున్నా. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తా' అని అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy