Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
GV Narayanarao: కుమారుడు, కుమార్తె వచ్చాకే  అంత్యక్రియలు

GV Narayanarao: కుమారుడు, కుమార్తె వచ్చాకే అంత్యక్రియలు

Chitrajyothy 3 weeks ago

సీనియర్‌ నటుడు జీవీ నారాయణరావు (GV Narayanarao 73) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఆయన మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

1976లో కె. బాలచందర్‌ దర్శకత్వం వహించిన 'అంతులేని కథ' చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన జీవీ నారాయణరావు.. ఆ తర్వాత వందకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 'ఆలోచన' త్వరలో విడుదల కానుంది.

ప్రస్తుతం జీవీ నారాయణరావు పార్థివదేహాన్ని ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానం మార్చురీలో ఉంచారు. అమెరికాలో ఉంటున్న ఆయన కుమారుడు అవినాష్, యూకేలో ఉంటున్న కుమార్తె లలిత యామిని, అల్లుడు హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

జీవీ నారాయణరావు మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. నటుడిగా తనదైన ముద్ర వేసిన ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా పలువురు పేర్కొంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy