ఈమధ్యకాలంలో సినీ నటులు సినిమాలు ఉన్నా లేకున్నా యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. స్టార్ హీరోస్ దగ్గరనుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు అందరూ వాణిజ్య ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి.. ? అది నిజమా కాదా.. ప్రజలను మోసం చేస్తున్నామా ఇలాంటివేమీ ఆలోచించకుండా చిక్కుల్లో పడుతున్నారు. ఇంకొంతమంది యాడ్స్ చేసే ముందు స్క్రిప్ట్ ఎలా ఉంది.. ? వివాదమేమైనా అవుతుందా.. ? అనేది ఆలోచించకుండా డబ్బుకోసం చేసేసి ఆ తరువాత ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా కమెడియన్ ఆలీ (Ali) కూడా అలాగే ఇబ్బందుల్లో పడ్డాడు.
గతకొంతకాలంగా ఘర్ మ్యాజిక్ సోప్ కి సంబంధించిన యాడ్స్ సోషల్ మీడియాను షేక చేస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హీరోలు, హీరోయిన్లు ఈ ఘర్ సోప్ గురించి యాడ్స్ మీద యాడ్స్ చేస్తున్నారు. ఒక్కసారి రుద్దితే నల్లగా ఉన్నవారు కూడా తెల్లగా మారిపోతారని, ఒక్కసారి వాడి చూడండి అంటూ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. అలా చెప్పినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు.. కానీ, ఆలీ ఈ సోప్ కి ఎలివేషన్ ఇవ్వడానికి లక్ష్మీస్తోత్రంను వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు.

