Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇది మనందరి కథ.. ఈసారి శ్రీవిష్ణు ఏడిపించేలా ఉన్నాడే

ఇది మనందరి కథ.. ఈసారి శ్రీవిష్ణు ఏడిపించేలా ఉన్నాడే

Chitrajyothy 1 week ago

ర్సటైల్ నటుడు శ్రీవిష్ణు (Sree Vishnu) వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తాజాగా శ్రీవిష్ణు మరో కొత్త సినిమాను ప్రకటించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫోర్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నంబర్ 39లో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి సన్నీ సంజయ్ (Sunny Sanjay) దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను ఎస్. నాగవంశీ సమర్పణలో హారిక సూర్యదేవర నిర్మిస్తోంది. నేడు నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) పుట్టినరోజు కావడంతో.. కుమార్తె హారిక, అన్న కొడుకు నాగవంశీ ఆయనకు ప్రొడక్షన్ నంబర్ 39 కాన్సెప్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఆయనకు బర్త్ డి విషెస్ తెలిపారు.

ఈ వీడియోలో ప్రతి సగటు మధ్యతరగతి యువకుడి జీవిత ప్రయాణాన్ని ఎంతో హృద్యంగా చూపించారు. చిన్నతనంలో స్కూల్‌లో ఎన్నో రకాల కలలు కనడం, ఆ తర్వాత స్తోమతకి తగ్గట్టు సాధారణ కాలేజీలో చదువుకోవడం, పెద్దయ్యాక కుటుంబ బాధ్యతల వల్ల నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ రోజూ లోకల్ ట్రైన్లు, మెట్రోలలో ప్రయాణించడం వంటి అంశాలను భావోద్వేగంగా ఆవిష్కరించారు. ఈ ప్రయాణంలో అసలు మనం ఏమవ్వాలనుకున్నామో మర్చిపోయి బతుకుతుంటామని, ఇది ప్రతీ ఒక్కరి కథ అని నేపథ్య వాయిస్ ఓవర్‌తో చెప్పడం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది.

ఇక ఈ సినిమాలో శ్రీవిష్ణు సూర్య అనే పాత్రలో కనిపించనున్నాడు. స్టోరీ ఆఫ్ ఏవ్రీ యంగ్‌స్టర్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రానికి దీపిన్ శ్రీ నెట్టారా సంగీతం అందిస్తున్నాడు. ప్రతిసారి కామెడీతో నవ్వించే శ్రీవిష్ణు.. ఈసారి ఒక మంచి కుటుంబ కథతో ఏడిపించేలా ఉన్నాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది . మరి ఈ సినిమాతో శ్రీవిష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy