Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ilayaraja: నాలో ఎలాంటి మార్పు లేదు.. ఇళయరాజా సంగీతానికి 50 వసంతాలు

Ilayaraja: నాలో ఎలాంటి మార్పు లేదు.. ఇళయరాజా సంగీతానికి 50 వసంతాలు

Chitrajyothy 1 week ago

తాను తొలిసారి సంగీత దర్శకత్వం వహించిన రోజుకు, వెయ్యి చిత్రాలకు పైగా సంగీతం సమకూర్చిన ఈనాటికీ తనలో ఎలాంటి మార్పులేదని 'ఇసైఙ్ఞాని' ఇళయరాజా (Ilayaraja)అన్నారు.

ఆయన తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన 'అన్నకిళి' (Annakkili) చిత్రం సరిగ్గా యాభై ఏళ్ల కిత్రం 1976 మే 14న విడుదల అయింది.

ఈ సందర్భంగా ఆయన ఇటీవల చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. 'యాభై ఏళ్లు గడిచిపోయాయని మీకు అనిపించువచ్చు కానీ నాకు అలా అనిపించడం లేదు. ఏళ్లు గడుస్తున్నా నేను మాత్రం అలాగే ఉన్నా. నాలో ఎలాంటి మార్పు లేదు. సంగీత స్వరాలు సమకూర్చే సమయంలో మనసులో నాకు మరే ధ్యాస ఉండదు. మనసు లోతుల్లోంచి వచ్చేదే సంగీతం. నేను లేకపోయినా నా సంగీతం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.

నేను సంగీతం సమకూర్చిన తొలి చిత్రాన్ని గుర్తు పెట్టుకుని అభినందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అన్నారు ఇళయరాజా. త్వరలోనే 'సింపనీ 2' సిద్ధమవుతోందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. యాభై వసంతాల తన సినీ జీవితంలో 1500లకు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి 8500 పాటలు అందించి సరికొత్త రికార్డ్‌ నెలకొల్పారు. లండన్‌లో సింఫనీ ఆర్కెస్ట్రా నిర్వహించిన తొలి భారతీయ సంగీత విధ్వాంసుడుగా గుర్తింపు పొందారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy