Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జాంబీ రెడ్డి 2.. ఈ రేంజ్ లెవెల్ ఊహించలేదయ్యా వర్మా

జాంబీ రెడ్డి 2.. ఈ రేంజ్ లెవెల్ ఊహించలేదయ్యా వర్మా

Chitrajyothy 23 hrs ago

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన తర్వాత, కథానాయకుడిగా పరిచయమై సంచలనం సృష్టించిన చిత్రం జాంబీ రెడ్డి (Zombie Reddy).

దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెలుగు చిత్రసీమలోనే తొలిసారిగా ఒక వినూత్నమైన జాంబీ కాన్సెప్ట్‌ను, రాయలసీమ ఫ్యాక్షనిజంతో మిక్స్ చేసి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించింది. కరోనా తదుపరి పరిస్థితుల్లో కూడా థియేటర్లకు ప్రేక్షకులను భారీగా రప్పించి, తేజ సజ్జాను హీరోగా నిలబెట్టడంలో ఈ చిత్రం కీలక పాత్ర పోషించింది.

ఈ మైలురాయి లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా జాంబీ రెడ్డి 2 NXT LVL ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నేడు తేజ సజ్జా పుట్టినరోజు కావడంతో ఈ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోని రిలీజ్ చేసి తం హీరోకు బర్త్ డే విషెస్ తెలిపారు. మొదటి భాగానికి పనిచేసిన ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు కథను అందించగా, ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, రానా నాయుడు, HAQ ఫేమ్ సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వ బాధ్యతలను స్వీకరించాడు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సీక్వెల్‌లో తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ షనయ కపూర్ నటిస్తోండగా కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ తెలిపారు. చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఈసారి జాంబీల విధ్వంసం, హర్రర్, కామెడీ మరింత నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని మేకర్స్ స్పష్టం చేశారు. ఇక ఏఐ లో చేస్తే క్లారిటీ సరిగ్గా రాదని ప్రశాంత్ వర్మ.. ఈ చిన్న వీడియోనే 3డిలో చేశారట.

గ్లిమ్స్ అంతా ఒక ఎత్తు అయితే.. దానికి ఫోక్ సాంగ్ ను యాడ్ చేయడం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈసారి బాలీవుడ్ టచ్ తో రాయలసీమ ఫ్యాక్షనిజం చూపించడానికి ప్రశాంత్ వర్మ సిద్దమయ్యాడు. గౌర హరి సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ 2027 లో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, నేపాలి మరియు జపనీస్ భాషలలో పాన్-ఇండియా/గ్లోబల్ స్థాయిలో విడుదల కానుంది. తొలి భాగంతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన తేజ సజ్జ, ఈ సీక్వెల్‌తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy