Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైలర్‌2 షూటింగ్‌లో ప్రమాదం.. ఒకరి మృతి

జైలర్‌2 షూటింగ్‌లో ప్రమాదం.. ఒకరి మృతి

Chitrajyothy 1 week ago

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న జైలర్-2 (Jailer 2) చిత్రీకరణలో ప్రమాదం జరగడంతో కార్తికేయన్ (28) అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు.

చెన్నై నగర శివారు ప్రాంతమైన పనైయూరులోని ఒక ప్రైవేటు స్టూడియోలో మూవీ షూటింగ్ (ప్యాచ్ వర్క్) జరుగుతుండగా, సేలంకు చెందిన కార్తికేయన్ ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నాడు.

విధుల్లో నిమగ్నమైవున్న సమయంలో విద్యుదాఘాతంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కాగా నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యానర్‌పై నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy