Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'జన నాయగన్‌'.. రిలీజ్‌పై విజయ్‌ దృష్టి! నిర్మాతకు.. అత్యవసర పిలుపు

'జన నాయగన్‌'.. రిలీజ్‌పై విజయ్‌ దృష్టి! నిర్మాతకు.. అత్యవసర పిలుపు

Chitrajyothy 1 week ago

హెచ్‌.వినోద్ (H Vinoth) దర్శకత్వంలో విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం 'జన నాయగన్‌' (Jananayagan). కేవీఎన్‌ ప్రొడక్షన్ (KVN Productions) పతాకంపై రూపొందిన చిత్రంలో పూజా హెగ్డే (Pooja Hegde), మమితా బైజు, బాబీ డియోల్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రియమణి తదితరులు నటించగా అనిరుధ్‌ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం సమకూర్చారు.

జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదలకావాల్సిన ఈ చిత్రం సెన్సార్‌ వివాదం కారణంగా ఇప్పటివరకు విడుదలకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్‌ తేదీపై కోలీవుడ్‌లో సరికొత్త ప్రచారం సాగుతోంది.

జూన్‌ 22న హీరో విజయ్‌ తన 53వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఆ రోజున విజయ్‌ బర్త్‌డే స్పెషల్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత వెంకట్‌ కె.నారాయణ భావిస్తున్నట్టు సమాచారం. మరికొందరు మాత్రం ఈనెల 28న ఈ చిత్రం విడుదల కావొచ్చని చెబుతున్నారు. అయితే, ఈ మూవీ విడుదలపై మేకర్స్‌ అధికారికంగా ఒక ప్రకటించాల్సివుంది.

ఇదిలా ఉండగా.. సెన్సార్‌ వివాదంలో చిక్కుకుని విడుదలకు నోచుకోని 'జన నాయగన్‌' చిత్ర విడుదలపై ఆ చిత్ర హీరో, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ దృష్టిసారించారు. ఇందులోభాగంగా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉన్న ఆ చిత్ర నిర్మాత వెంకట్‌ కె.నారాయణను నగరానికి పిలిపించారు. దీంతో హుటాహుటిన నగరానికి చేరుకున్న నిర్మాత స్థానిక పట్టిణంపాక్కంలోని నివాసంలో సీఎం విజయ్‌తో సమావేశమై తదుపరి చర్యలపై చర్చించినట్టు కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy