ప్రముఖ నటి షావుకారు జానకి (Sowcar Janaki) అంత్యక్రి యలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకపోవడం పట్ల ప్రముఖ సినీ నిర్మాత, దక్షిణ భారత చలన చిత్ర మండలి మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ (Katragadda Prasad) తీవ్ర విచారం, ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఆయన శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 'భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో పేరు ప్రఖ్యాతులతో పాటు మహానటిగా గుర్తింపు పొందిన షావుకారు జానకి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకపోవడం విచారకరం.
ఇటీవల కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు మృతి చెందగా వారికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలను నిర్వ హించింది. కానీ, షావుకారు జానకి విషయంలో అలా జరకపోవడం పట్ల తమిళనాడు (Tamilnadu) లోని తెలుగు ప్రజలు, ఆమె అభిమానులు ఎంతగానో బాధ పడుతున్నారు. అలాగే, చిత్రపరిశ్రమకు చెందిన సీఎం విజయ్ (CM Vijay) కూడా కాస్త వెసులు బాటు చూసుకుని షావుకారు జానకి భౌతికకాయాన్ని చివరిసారి చూసి నివాళులు అర్పించివుంటే మరెంతో బాగుండేది' అని కాట్రగడ్డ ప్రసాద్ పేర్కొన్నారు.

