Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'కిల్లర్' సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. రూ. కోటి గెలుచుకోండి: దర్శకుడు పూర్వాజ్

'కిల్లర్' సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. రూ. కోటి గెలుచుకోండి: దర్శకుడు పూర్వాజ్

Chitrajyothy 14 hrs ago

జ్యోతి పూర్వజ్ (Jyoti Poorvaj), పూర్వాజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ 'కిల్లర్' (Killer Movie). మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ (Director Poorvaaj) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్‌లో ఈ మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవర్ డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత పూర్వాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా పూర్వాజ్ మాట్లాడుతూ.. ''మా మూవీ ట్రైలర్ మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిందని నమ్ముతున్నాను. ఇంతకు ముందు వచ్చిన టీజర్‌ను ట్రిక్కిగా చేశాం. ఆ టీజర్‌లో జ్యోతి టెర్రరిస్ట్, హౌస్ వైఫ్, వ్యాంపైర్, స్పై, సూపర్ షీ వంటి డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించారు. టీజర్‌తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అప్పుడు వీఎఫ్ఎక్స్ వాళ్లు మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్‌లో మా సినిమా రిలీజ్ కావాలి. వీఎఫ్ఎక్స్ వల్ల దాదాపు ఏడాది ఆలస్యమైంది. క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాకూడదని వెయిట్ చేస్తూ వచ్చాం. టీజర్‌లో ఉన్న ట్విస్ట్‌లను కొనసాగిస్తూ ట్రైలర్ చేశాం. టీజర్‌లో నేను పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తే, ట్రైలర్‌లో పోలీస్ ఆఫీసర్‌తో పాటు సైంటిస్ట్‌గా పరిచయమయ్యాను. ఇందులో డీప్‌గా ఒక అందమైన కథ ఉంటుంది. అందులో నుంచి ఒక్క షాట్ కూడా ట్రైలర్‌లో చూపించలేదు. ప్రతి దర్శకుడు తమది కొత్త సినిమా అని, ఎప్పుడూ చూసి ఉండరనే అంటారు. నేను కూడా అదే చెబుతున్నా. నేను చెప్పడం కాదు ఈ నెల 30న అందరూ థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు.

2024, 25, 26 సంవత్సరాల నేపథ్యంతో మూడు డిఫరెంట్ లేయర్స్ ఉన్న కథతో ఈ సినిమా ఉంటుంది. జ్యోతి చేసిన అన్ని పాత్రలను తెరపై చూస్తున్నప్పుడు కొత్తగా ఫీల్ అవుతారు. జ్యోతి ఈ క్యారెక్టర్స్ మేకోవర్ కోసం, బాడీ లాంగ్వేజ్, పర్ ఫార్మెన్స్ కోసం చాలా కష్టపడ్డారు. జ్యోతి చేసిన అన్ని పాత్రలను సమ్మరైజ్ చేస్తూ ఆమె ఏలియనా, ప్రత్యేకమైన శక్తులు ఉన్న మహిళా, ఆమె ఎవరు అనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కథలో జరుగుతుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా నిలుస్తుంది. ఆమె ఎవరు అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంటుంది. ఆ క్యారెక్టర్‌లోని ట్విస్ట్ ఏంటనేది ఎవరూ ఊహించలేరు. సెకండాఫ్‌లో వచ్చే ఆ ట్విస్ట్‌ను ఇంటర్వెల్ పడిన ఐదు నిమిషాల్లోపు ఊహించి మేము ఇచ్చే వాట్సాప్ నెంబర్‌కు పంపిస్తే.. ఆ పర్సన్‌కు మా మూవీ సక్సెస్ మీట్ రోజున కోటి రూపాయల బహుమతి అందిస్తాం. మీరు ఇలాంటి సినిమా ఇప్పటి వరకు చూడలేదు అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాను.

మా సినిమా చూసిన మల్టిప్లెక్స్ ఆడియెన్స్ కొత్త ప్రయత్నం చేశారని అంటారు. సింగిల్ స్క్రీన్స్‌లో సినిమా చూసే ప్రేక్షకులు బాగా చేశారంటారు. కిల్లర్ సినిమా చూస్తూ మీరు థ్రిల్ ఫీల్ అవుతారు, ఎగ్జైట్ అవుతారు. నేను ఈ సినిమాకు తీసిన రష్ 2.15 నిమిషాలు. సినిమా నిడివి 2 గంటలు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక రైట్స్ అమ్ముడయ్యాయి. కన్నడతో పాటు తమిళంలోనూ మా మూవీ రిలీజ్ కాబోతోంది. ఓవర్సీస్ డీల్ క్లోజ్ అయ్యింది. రెండు ఓటీటీల నుంచి ఆఫర్స్ ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమా మీరు గుండెల్లో దాచిపెట్టుకునేలా ఉంటుంది. మా టీమ్ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నాను'' అన్నారు.

:

RC17కు 'దేవి శ్రీ ప్రసాద్' ఉంటారా? క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్

'వృషకర్మ' పోస్టర్‌లో డివైన్ వైబ్స్.. నాగచైతన్య ఇంటెన్స్ లుక్ అదుర్స్

రగ్గడ్ లుక్‌లో రామ్ చరణ్.. 'RC17' స్క్రిప్ట్ రీడింగ్‌లో.. పిక్ వైరల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy