Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కీర్తి రెడ్డితో విడాకులకు కారణమిదే: సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కీర్తి రెడ్డితో విడాకులకు కారణమిదే: సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chitrajyothy 3 weeks ago

క్కినేని కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయమై, తనదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటుడు సుమంత్ (Sumanth).

వ్యక్తిగత జీవితం కంటే ఎక్కువగా సినిమాలతోనే వార్తల్లో ఉండే ఈ వర్సటైల్ యాక్టర్, తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన మాజీ భార్య, నటి కీర్తి రెడ్డి (పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' హీరోయిన్)తో విడాకులకు గల అసలు కారణాలను మరోసారి బహిరంగంగా పంచుకున్నారు. పెళ్లి సమయానికి తమ ఇద్దరికీ సరైన మెచ్యూరిటీ లేకపోవడమే తాము విడిపోవడానికి ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు. ఆ సమయంలో తమ వైవాహిక జీవితం ఒక సినిమా కథలాగా సాగిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

విడాకులు తీసుకున్నప్పటికీ, కీర్తి రెడ్డి (Keerthi Reddy) కుటుంబంతో తమ బంధం ఇప్పటికీ కొనసాగుతుండటం విశేషమని సుమంత్ తెలిపారు. ''మేము విడిపోయినంత మాత్రాన శత్రువులం కాలేదు. కీర్తి రెడ్డి కుటుంబ సభ్యులు నన్ను ఇప్పటికీ తమ కుటుంబంలో ఒక సభ్యుడిగానే ఎంతో ఆప్యాయంగా చూస్తారు. కీర్తి రెడ్డి కూడా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి యోగక్షేమాలు మాట్లాడుతుంటుంది. మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు (ANR) చనిపోయిన సమయంలో ఆమె వ్యక్తిగతంగా వచ్చి నన్ను, మా కుటుంబాన్ని పరామర్శించారు'' అని సుమంత్ ఎమోషనల్‌గా చెప్పారు.

ప్రస్తుతం కీర్తి రెడ్డి మరొకరిని వివాహం చేసుకుని ఒక మంచి కుటుంబంలో ఎంతో సంతోషంగా స్థిరపడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని సుమంత్ పేర్కొన్నారు. తన పునర్వివాహం గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు రెండో పెళ్లి (Sumanth Second Marriage) చేసుకునే ఆలోచన ఏమీ లేదని, భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనని స్పష్టం చేశారు. గతంలో జరిగిన వివాహం గురించి తనకెలాంటి బాధ లేదా రిగ్రెట్ లేదని తేల్చి చెప్పారు. వివాహ వ్యవస్థపై తనకు ఇప్పటికీ పరిపూర్ణమైన నమ్మకం ఉందని, అయితే ఆ బంధం విజయవంతం కావడం అనేది దంపతులిద్దరి మైండ్‌సెట్‌పై ఆధారపడి ఉంటుందని సుమంత్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సుమంత్ ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

జానీ మాస్టర్ వైఫ్ సుమలత తీరుపై ఫెడరేషన్, నిర్మాతలు తీవ్ర ఆగ్రహం

'అనకాపల్లి'కి రియల్ హీరో సోనూ సూద్ సపోర్ట్.. ఏం చేశారంటే

మంజు భార్గవి ఆటోబయోగ్రఫీ.. బుక్ టైటిల్ తెలిస్తే షాకే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy