Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొడుకు వల్ల మాటపడ్డ మహేష్..

కొడుకు వల్ల మాటపడ్డ మహేష్..

Chitrajyothy 3 weeks ago

ట్టమనేని వారసుడు జయకృష్ణ(Ghattamaneni Jayakrishna) ఎట్టకేలకు శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఒక స్టార్ వారసుడి ఎంట్రీలా అయితే అతని ఎంట్రీ లేకపోవడంతో అన్న కొడుకును మహేష్ బాబు పట్టించుకోలేదని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

సాధారణంగా స్టార్ కుటుంబం నుంచి హీరో వస్తున్నాడు అంటే హంగామా అంతా ఇంతా ఉండదు. కానీ, జయకృష్ణ విషయంలో అదేది జరగలేదు. ఒక కొత్త కుర్రాడు ఇండస్ట్రీకి పరిచయం అయినా ఇంతకన్నా ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యేది. అజయ్ భూపతి లాంటి స్టార్ డైరెక్టర్.. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా హీరోయిన్.. అన్నింటికీ మించి మోహన్ బాబు కీలక పాత్రలో నటించాడు. ఇన్ని స్పెషల్స్ ఉన్నా కూడా జయకృష్ణ సినిమా మాత్రం చిన్న సినిమా అందుకొనే కలక్షన్స్ కూడా అందుకోలేకపోయింది. దీనికి కారణం కేవలం మహేష్ బాబు(Mahesh Babu) నే అని ఇండస్ట్రీ మొత్తం కోడై కూస్తోంది. జయకృష్ణకు మహేష్ సపోర్ట్ పూర్తిగా దక్కలేదు అన్నది మాత్రం వాస్తవం. అలాగని, అసలు మహేష్.. జయకృష్ణని పట్టించుకోలేదని అన్న మాట మాత్రం అవాస్తవమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

మహేష్ తన సొంత అన్న కొడుకు సినిమా ప్రమోషన్స్ లో సరిగా పాల్గొనలేదని, అందుకే ఆ సినిమాకు రావలసినంత క్రేజ్ రాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం వారణాసి రిలీజ్ కాకముందు బయటి ప్రపంచానికి కనిపించరాదని భావించారా? అంటే అదేమీ లేదు ఇటీవల తమ ఏయమ్బీ థియేటర్ లో ఓ సినిమా చూడటానికి తన హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త జోనాస్ తో కలసి పబ్లిక్ లో కనిపించాడు మహేష్. రాజమౌళి ఏమైనా వారణాసి వచ్చేదాకా పబ్లిక్ ఫంక్షన్స్ లో పాల్గొనరాదని కండిషన్ పెట్టారా? అంటే అలాంటిదేమీ రాజమౌళి దగ్గర ఉండదు. ఎందుకంటే యన్టీఆర్, రామ్ చరణ్ తో ట్రిపుల్ ఆర్ తెరకెక్కించిన రోజుల్లో ఆ ఇద్దరు హీరోలు వేరే పబ్లిక్ ఫంక్షన్స్ లో పాలు పంచుకున్నారు.. కాబట్టి రాజమౌళిని బ్లేమ్ చేయడం సరికాదనీ సినీజనం అంటున్నారు. మొత్తానికి మహేశ్ బాబు శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్ లో పాలు పంచుకోకపోవడం సరికాదని మరికొందరి మాట.

మహేష్ అన్న కొడుకు జయకృష్ణ ఊహ తెలియని రోజుల్లో నిజం సినిమాలో తెరపై కనిపించాడు. అయితే మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ వన్ - నేనొక్కడినే చిత్రంలో చిన్నప్పటి హీరోగా నటించాడు. అందువల్ల మహేష్ ఫ్యాన్స్ గౌతమ్ కృష్ణనే తమ నటవారసునిగా భావిస్తారు. ఈ కోణంలో తన అన్న కొడుకు సినిమాకు అదే పనిగా పబ్లిసిటీ చేయడం ఎందుకు అని మహేష్ భావించి ఉండవచ్చునని కొందరు అంటున్నారు. ఏ సినిమా అయినా జనాన్ని ఆకట్టుకోవాలంటే అందులో సత్తా ఉండాలి.. శ్రీనివాస మంగాపురం లో ఆకట్టుకొనే కథలేకపోవడం వల్లే డివైడ్ టాక్ తో నడుస్తోంది. ఒకవేళ మహేష్ వచ్చి ప్రమోషన్ చేసినా, అందులో విషయం లేకపోతే ఆడుతుందా అనీ మరికొందరు ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఏది ఏమైనా శ్రీనివాస మంగాపురం రిజల్ట్ కారణంగా మహేష్ మాట పడాల్సి వచ్చింది. మునుముందు జయకృష్ణ సినిమాల్లో దేనికైనా మహేశ్ పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తాడేమో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy