Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. 'పెద్ది' ట్రైలర్‌పై నాగవంశీ

కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. 'పెద్ది' ట్రైలర్‌పై నాగవంశీ

Chitrajyothy 6 days ago

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi).

ఈ చిత్ర ట్రైలర్ కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. నేడు (సోమవారం) ఈ చిత్ర ట్రైలర్‌ను ముంబైలో జరిగే వేడుకలో మేకర్స్ విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ట్రైలర్ చూసిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌తో.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంటే.. ఇప్పుడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) కూడా ఈ ట్రైలర్‌పై ఒక క్రేజీ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ సినిమా ట్రైలర్ చూసిన ఆయన.. బాక్సాఫీస్ వద్ద స్ట్రెయిట్‌గా స్టేడియం వెలుపలికి వెళ్లే భారీ సిక్సర్‌లా దూసుకుపోవడం ఖాయమంటూ ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు. ఈ ట్రైలర్‌లో రామ్ చరణ్ ఊరమాస్ ఎలివేషన్లను ఉద్దేశిస్తూ నాగవంశీ ఒక అదిరిపోయే పోలికను తీసుకొచ్చారు. ''విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడటం అందరూ చూశారు కదా.. అదే కోహ్లీ (Virat Kohli) కుస్తీ కూడా ఆడితే ఎలా ఉంటుందో జస్ట్ ఊహించుకోండి.. 'పెద్ది'లో రామ్ చరణ్ క్యారెక్టర్, ఆయన బాడీ లాంగ్వేజ్ సరిగ్గా అలాగే ఉన్నాయి'' అంటూ రాసుకొచ్చారు. సినిమాలో మెగా పవర్‌స్టార్ అబ్సల్యూట్ బీస్ట్ మోడ్‌లో అదరగొట్టేశారని, అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ స్క్రీన్‌పై అత్యంత అందంగా కనిపిస్తోందని నాగవంశీ ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ ట్వీట్‌లో ఆయన హైలైట్ చేసిన మరో ఆసక్తికరమైన అంశం సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ట్రైలర్ చివర్లో వచ్చే ఒక ప్రత్యేకమైన 'క్రాస్ ఓవర్ షాట్' మైండ్ బ్లోయింగ్ అని, అది థియేటర్లలో ప్రేక్షకులకు ప్యూర్ మాస్ సినిమా అనుభూతిని ఇస్తుందని నాగవంశీ పేర్కొన్నారు. ఒక స్టార్ ప్రొడ్యూసర్ నుంచి 'పెద్ది' ట్రైలర్‌పై ఈ రేంజ్ రివ్యూ రావడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జూన్ 4న థియేటర్లలో ఈ ఊచకోత చూడటానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!

Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!

లేటు వయసులో ఖరీదైన 'పోర్షే' లగ్జరీ కారు.. సీనియర్ నరేశ్ జల్సానే జల్సా! ఖరీదెంతో తెలుసా?

Chiranjeevi: 'పెద్ది' ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy