Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kollywood: కోలీవుడ్‌లో నెక్స్ట్ సూపర్ స్టార్ అతనేనా?

Kollywood: కోలీవుడ్‌లో నెక్స్ట్ సూపర్ స్టార్ అతనేనా?

Chitrajyothy 6 days ago

మిళ సినీ ఇండస్ట్రీలో (Kollywood) ఇప్పుడో చర్చ బాగా నడుస్తోంది. ఇళయ దళపతి విజయ్ (Vijay) తర్వాత కోలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలబోయే ఆ నెక్స్ట్ స్టార్‌ హీరో ఎవరు అని..?

ప్రస్తుతం విజయ్ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రికార్డులు సృష్టించారు. రెండు పెద్ద పార్టీలను ఓడించి, ఏకంగా తమిళగ వెట్రి కళగం పార్టీ తరపున విజయ్‌ సీఎం కుర్చీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. అటు సినిమా రంగం, ఇటు సోషల్ మీడియా ఆయన విజయాన్ని చూసి అభినందనల వర్షం కురిపిస్తోంది. అయితే, విజయ్ ఫుల్ టైమ్ పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోవడంతో.. ఆయన వదిలేసిన ఆ అగ్ర స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కోలీవుడ్‌లో సీనియర్ దిగ్గజాలు రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan) ఇప్పటికీ సినిమాలు చేస్తున్నప్పటికీ, వారు చాలా సెలెక్టివ్‌గా ముందుకు సాగుతున్నారు. ఎంతమంది కొత్త హీరోలు వచ్చినా వారి స్థానాన్ని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాని పని. సరే, విజయ్‌కు సమకాలీనుడైన అజిత్ కుమార్ (Ajith Kumar) విషయానికి వస్తే.. ఆయనకు సినిమాల కంటే రేసింగ్ ట్రాక్‌ల పైనే శ్రద్ధ ఎక్కువైంది. బైక్ రైడింగ్, కార్ రేసింగ్ అంటూ ఆయన తన వ్యక్తిగత అభిరుచులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ చూపు అంతా ఇప్పుడు ఒకే ఒక్కడి వైపు తిరిగింది. ఆయనే వైవిధ్యమైన నటనకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరో సూర్య. ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. విజయ్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ఉన్న హీరో సూర్య (Suriya) మాత్రమే. దీనికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. సూర్యకు కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడి అగ్ర హీరోలతో సమానంగా ఆయన సినిమాలు తెలుగులో వసూళ్లు రాబడుతుంటాయి. వివాదాలకు అత్యంత దూరంగా ఉంటూ, కేవలం తన పని తానే చూసుకునే మంచి వ్యక్తిత్వం ఆయన సొంతం. రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, సరికొత్త ప్రయోగాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు.

గతంలో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, సూర్య ఏమాత్రం వెనకడుగు వేయలేదు. సరైన కథ పడితే తన విశ్వరూపం ఎలా ఉంటుందో రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'కరుప్పు' అలియాస్ 'వీరభద్రుడు' సినిమాతో నిరూపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నిజానికి 'కరుప్పు' సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకరోజు ఆలస్యంగా విడుదలవ్వడం, టాక్‌ పరంగా, రివ్యూస్‌ పరంగా పెద్దగా సౌండ్ లేకపోయినా.. కేవలం సూర్య ఇమేజ్‌తోనే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్స్‌ను సాధిస్తుంది. పైగా గత కొన్ని రోజులుగా బాక్సాఫీస్‌ వద్ద సరైన మాస్‌ సినిమా లేకపోవడం కూడా కరుప్పు సినిమాకు బాగా కలిసొచ్చింది. వీకెండ్‌ సమయంలో నిన్న ఒక రోజే తమిళనాడులో 4 లక్షలకు పైగా టికెట్స్‌ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ. 150 కోట్ల మేర కలెక్షన్స్‌ సాధిస్తుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సక్సెస్ సూర్యను రేసులో అందరికంటే ముందు నిలబెట్టింది. ఇక సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. తెలుగులో రానున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు పక్కా మాస్, యాక్షన్ సినిమాలతో మెప్పించిన సూర్య.. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర కాబోతున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సూర్య క్రేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. మరి విజయ్ వదిలిన ఆ నెంబర్ వన్ స్థానాన్ని సూర్య ఖాయం చేసుకుంటారో లేదో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy