Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రేజీ అప్డేట్.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో సూర్య.. 'జై భీమ్' కాంబో రిపీట్!

క్రేజీ అప్డేట్.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌లో సూర్య.. 'జై భీమ్' కాంబో రిపీట్!

Chitrajyothy 3 weeks ago

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చేసింది. 'కెజియఫ్', 'సలార్', 'కాంతార' వంటి భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) తమ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది.

సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమా కోసం సరికొత్త లైనప్‌ను సెట్ చేశారు. ఈ కాంబోకు సంబంధించి హోంబలే ఫిలింస్ తాజాగా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనతో ఒక్కసారి సోషల్ మీడియా షేక్ అవుతోంది.

సూర్య కెరీర్‌లో ప్రశంసలు అందుకున్న సామాజిక డ్రామా 'జై భీమ్' (Jai Bhim) చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ (TJ Gnanavel) దర్శకత్వంలో ఈ సరికొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. హోంబలే ఫిలింస్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థతో జ్ఞానవేల్-సూర్య కాంబో కలవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వాస్తవానికి 'జై భీమ్' కాంబో రిపీట్ కాబోతోందని.. కొన్ని రోజులుగా వార్తలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, ఈ ప్రాజెక్ట్‌ని హోంబలే ఫిలింస్ టేకోవర్ చేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇది నిజంగా సూర్య అభిమానులకు అతి పెద్ద సర్‌ప్రైజ్ అనే చెప్పుకోవాలి. ఇక హోంబలే ఫిలింస్ విడుదల చేసిన ప్రకటనలో సూర్య సినీ ప్రస్థానాన్ని కొనియాడుతూ భావోద్వేగభరితంగా సదరు సంస్థ రియాక్ట్ అయింది.

''ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఫ్రేమ్ బై ఫ్రేమ్.. ఫిల్మ్ బై ఫిల్మ్.. ఫైట్ బై ఫైట్! నిజాయితీతో కూడిన పాత్రలు, యదార్థ జీవితాల బరువును మోసిన క్యారెక్టర్స్. ధైర్యం, నమ్మకం, నైపుణ్యంతో సాగిన ప్రయాణం. వెండితెరపై మూడు దశాబ్దాల సుదీర్ఘ అద్భుత ప్రస్థానం. ప్రస్తుత తరంలో సాహసోపేతమైన నటుడు.. తన కెరీర్‌లోనే అతిపెద్ద వేదికపైకి అడుగుపెడుతున్నారు. అతనికి హోంబలే ఫిలింస్ సాదర స్వాగతం పలుకుతోంది..'' అంటూ తమ బ్యానర్‌లో సూర్యతో వర్క్ చేయడాన్ని హోంబలే ఫిలింస్ సంస్థ ఎంత గౌరవంగా భావిస్తుందో నిర్మాత తెలియజేశారు. ఇక ఈ చిత్రం టెక్నీషీయన్స్ విషయానికి వస్తే.. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కు టెక్నికల్ పరంగా కూడా క్రేజీ టీమ్ సెట్ అయింది.

టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించనున్న ఈ చిత్రంలో సూర్య సరసన కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించనుంది. సాయి అభ్యంకర్ సంగీతం, ఎస్.ఆర్ కతీర్ డీఓపీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, టైటిల్, షూటింగ్ అప్‌డేట్స్ త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు. ప్రస్తుతం సూర్య లైనప్‌లో ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

పాతికేళ్ల తర్వాత... ఈ జన్మలోనే నాకు నచ్చిన పాత్ర చేశా- అన్నపూర్ణమ్మ

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి డబుల్‌ ట్రీట్‌.. ఇక పట్టుకోలేరేమో

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy