Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Lavanya Tripathi: గీత గోవిందం.. నేను చేయాల్సింది! ఇప్పటికీ బాధ ఉంది

Lavanya Tripathi: గీత గోవిందం.. నేను చేయాల్సింది! ఇప్పటికీ బాధ ఉంది

Chitrajyothy 1 week ago

కెరీర్‌ బిజీగా ఉన్నప్పుడే వరుణ్‌ తేజ్ (Varun Tej)ని ప్రేమ వివాహం చేసుకొని, కొణిదెల వారి కోడలుగా స్థిరపడ్డారు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi).

చాలాకాలం విరామం తర్వాత ఆమె 'సతీ లీలావతి' (Sathi Leelavathi) చిత్రంలో నటించింది. ఈ సందర్భంగా తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించి చెప్పిన ఆసక్తికర విశేషాలివి.

నేనూ వేధింపులకు గురయ్యా..

వేధింపులనేవి సహజమే. ఇండస్ట్రీలో నేను కూడా వేధింపులను ఎదుర్కొన్నా. ఓ తమిళ డైరెక్టర్‌ నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ సినిమా వదులుకున్నా. దాంతో చిత్రబృందం నాపై కేసు పెట్టింది. అక్కడితో వదలిపెట్టలేదు. మీడియాలో నాపై తప్పుడు కథనాలు కూడా రాయించింది. గదిలో ఒంటరిగా కూర్చొని రోజంతా ఏడ్చాను. ఆ చేదు అనుభవం నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులను ఎలా హ్యాండిల్‌ చేయాలో అనుభవం ద్వారా నేర్చుకున్నా. సినీ గ్లామర్‌ వెనుక ఇలాంటి వ్యక్తిగత పోరాటాలు, ఒత్తిళ్ళు మామూలే.

మానసిక ప్రశాంతత ముఖ్యం

పని ఒత్తిడి నుంచి బయటపడడానికి, మానసిక ప్రశాంతత కోసం... ధ్యానం, యోగా, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తా. ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతా. పుస్తకపఠనం మన ఆలోచనల్ని పదును పెడుతుంది. మరింత పరిణతి చెందేలా చేస్తుంది. సంయమనాన్ని నేర్పుతుంది. ఒక నటిగా, భార్యగా, తల్లిగా ఎంత బిజీగా ఉన్నా.. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటిస్తా. తద్వారా ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకుంటా. ఇదే నా ఆరోగ్య రహస్యం.

కొంత బాధ ఉన్నా...

'గీత గోవిందం' (Geetha Govindam)లో హీరోయిన్‌ ఆఫర్‌ ముందుగా నాకే వచ్చింది. ఆ సమయంలో నేను వేరే చిత్రాల్లో బిజీగా ఉండడంతో 'నో' చెప్పాను. ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యిందో తెలిసిందే. అలాంటి మంచి సినిమాను మిస్‌ చేసుకోవడం కొంత బాధ కలిగించే విషయమే అయినా... ఆ సమయంలో నాకున్న ప్రాధాన్యతల దృష్ట్యా అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నిజానికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం, చేజారిపోవడం సహజమే. అందుకే దాని గురించి పెద్దగా ఆలోచించను.

ఆ కళ్లను చూసే ప్రేమలో పడ్డా

ఒక సినిమా వేడుకకు వరుణ్‌, నేను హాజరయ్యాం. వరుణ్‌ నా పక్కనే కూర్చున్నాడు. కానీ అతనితో నేను మాట్లాడలేదు. ఆయన ఒకసారి అలా నావైపు తిరిగి చూశారు. అప్పుడు ఆయన కళ్లు నాకు బాగా నచ్చాయి. ఆ కళ్లను చూసే ప్రేమలో పడ్డాను. పెళ్లి తర్వాత ఆయన చాలా సపోర్టివ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా బాబును చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారు. వరుణ్‌ లాంటి భర్త దొరకడం నా అదృష్టం. మెగా కుటుంబం విషయంలో నేను ఎంతో లక్కీ!

అమ్మలా బుజ్జగిస్తాడు

దాంపత్యం అన్నాక అప్పుడప్పుడు అలకలు, చిన్న చిన్న గొడవలు తప్పవు. వరుణ్‌తో నాకు ఏమైనా గొడవ జరిగితే తను ఆర్గ్యూ చేస్తాడు. అప్పుడు నేను మౌనంగా ఉండిపోతా. ఆర్గ్యూ చేయడం నాకు అస్సలు నచ్చదు. చివరికి గొడవ సద్దుమణుగుతుంది. ఆ తర్వాత మళ్లీ ఎప్పటిలాగే మాట్లాడుకుంటాం. నిజానికి వరుణ్‌ తేజ్‌ నన్ను ఒక చిన్న పిల్లలా భావిస్తాడు. నేను అలిగితే అమ్మలా బుజ్జగిస్తాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy