Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Love Oh Love Trailer: బ్రేకప్ ని లీగలైజ్ చేయమంటున్నాడు..

Love Oh Love Trailer: బ్రేకప్ ని లీగలైజ్ చేయమంటున్నాడు..

Chitrajyothy 2 weeks ago

రోజుల్లో ప్రేమించడం ఎంత ఈజీనో.. ఆ ప్రేమను నిలబెట్టుకోవడానికి, లవర్ ఖర్చులను భరించడానికి అబ్బాయిలు పడే కష్టాలు అంతకంటే ఎక్కువ. అచ్చం ఇదే రియలిస్టిక్ అండ్ యూత్ ఫుల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం లవ్ ఓ లవ్ (Love Oh Love).

పవిష్, తెలుగు ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మహేష్ రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

కథ విషయనికొస్తే.. రఘు(పవిష్) చాలా మిడిల్ క్లాస్ అబ్బాయి. అప్పు అంటేనే ఆమడదూరంలో ఉండే తండ్రి.. ఒక కంపెనీలో జాబ్ చేస్తున్న రఘు.. అవంతిక( నాగదుర్గ) ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమించిన దగ్గర నుంచి ఆమె పెట్టే ఖర్చులకు అప్పులు చేస్తాడు. ఇక కరెక్ట్ గా వారిద్దరూ ఏకాంతంగా గడిపే సమయానికి కొందరు.. అవంతికని రఘు ఏదో చేసేస్తున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఇక పోలీసులతో రఘు తన కథను మొత్తం చెప్పి ఒక కండీషన్ పెడతాడు. నాలుగేళ్ళ లవ్ లో తాను ఆమె కోసం చేసినవన్నీ, ఓ నాలుగు నెలలు ఆమె తన కోసం చేయమని చెప్తాడు. అక్కడి నుంచి వారిద్దరి లైఫ్ లో జరిగిన మార్పులు ఏంటి.. ? లవ్ అబ్బాయిలు పడే కష్టాలు ఏంటి.. ? చివరకు ఈ జంట కలిశారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

లవ్ లో అబ్బాయిల కష్టాలను, రిలేషన్ షిప్ లో ఉండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ని కళ్లకు కట్టేలా ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్‌లు, క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టలేక అప్పులపాలయ్యే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పెయిన్, ఆ తర్వాత వాళ్ల మధ్య వచ్చే బ్రేకప్ ఇష్యూస్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా చదువు ఉద్యోగం అమ్మాయిలకి హక్కు.. కానీ అబ్బాయిలకి అది బాధ్యత అనే డైలాగ్స్ యూత్‌కి, ముఖ్యంగా కుర్రాళ్లకు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.ఈ చిత్రంలో సెల్వరాఘవన్, కె.ఎస్. రవికుమార్ లాంటి లెజెండరీ డైరెక్టర్స్ నటులుగా కనిపించడం సినిమాపై అంచనాలను పెంచేసింది. కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా.. నేటి తరం రిలేషన్ షిప్స్ లో ఉండే నగ్న సత్యాన్ని, మగాళ్ల బాధలను చాలా బోల్డ్‌గా, ఎంటర్టైనింగ్‌గా ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. జులై 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో తెలుగు అమ్మాయి నాగదుర్గ తమిళ్ లో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy