Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లుక్ టెస్ట్... డేట్ ఫిక్స్...

లుక్ టెస్ట్... డేట్ ఫిక్స్...

Chitrajyothy 14 hrs ago

కాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై షూటింగ్ మొదలుకాక ముందే ఇండస్ట్రీలో భారీ చర్చ మొదలైంది.

ప్రీ-ప్రొడక్షన్ పనులు, క్యారెక్టర్ డిజైన్‌కు ఇస్తున్న ప్రాధాన్యం చూస్తే ఇది సాధారణ స్టార్ హీరో సినిమా కాదనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.

లోకేశ్ సినిమాల్లో హీరోల బాడీ లాంగ్వేజ్, లుక్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సుకుమార్‌ 'పుష్ప'తో దేశవ్యాప్తంగా రగ్గడ్ లుక్‌తో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన బన్నీ కోసం.. ఇప్పుడు లోకేశ్ పూర్తిగా ఒక భిన్నమైన మేకోవర్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సరికొత్త ట్రాన్స్ఫర్మేషన్ కోసం అల్లు అర్జున్ కూడా గట్టిగానే ప్రిపేర్ అవుతున్నట్లు టాక్. ఇప్పటికే దీనిపై చర్చలు జరగ్గా.. జూన్ 25న ముంబైలో అఫీషియల్‌గా లుక్ టెస్ట్ కూడా చేయబోతున్నారనే బజ్ గట్టిగా వినిపిస్తోంది. ప్రజెంట్ అల్లు అర్జున్ 'రాకా' మూవీతో బిజీ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ముంబైలోనే బన్నీ ఉంటున్నారు. దీంతో ఈ సినిమాకు బ్రేక్ ఇచ్చి లుక్ టేస్ట్ లో పాల్గొబోతున్నారట. సో... లుక్ టెస్ట్ కోసం లోకేశ్ టీమ్ ముంబైకి పయనమైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా హల్చల్ చేస్తోంది. మూములుగానే లోకేశ్ సినిమా అంటేనే అందరికీ గుర్తొచ్చేది 'సినిమాటిక్ యూనివర్స్'. మరి ఈ ప్రాజెక్ట్ కూడా ఆ క్రేజీ యూనివర్స్‌లో భాగం కాబోతుందా... బన్నీ కూడా ఆ గ్యాంగ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారా? అన్న చర్చ జరుగుతోంది. మరి ఈ ఇద్దరు మాస్టర్ మైండ్స్ కలసి సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి మరి!

ఇవి కూడా చదవండి:

నారా లోకేష్‌తో తనని పోల్చగానే.. రామ్ చరణ్ ఏమన్నారంటే

నెట్‌ఫ్లిక్స్ ఊపిరి పీల్చుకో.. బాహుబలి టార్చ్‌బేరర్ వస్తున్నాడు!

పండంటి బిడ్డకు జననం.. నారా రోహిత్, శిరీష దంపతులకు ప్రమోషన్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy