Dailyhunt
మా ఇంట్లో హనుమంతుడు.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను..

మా ఇంట్లో హనుమంతుడు.. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేను..

Chitrajyothy 3 weeks ago

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అంజనీపుత్రుడు హనుమంతునికి పరమ భక్తులన్న విషయం తెలిసిందే! గురువారం హనుమాన్‌ జయంతిని (Hanuman Jayanathi) పురస్కరించుకొని ఓ విషయాన్ని ప్రత్యేక వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

మెగాస్టార్‌ పూజా మందిరంలో చోటుచేసుకొన్న ఓ అపురూప దృశ్యం గురించి ఆయన వీడియోలో చూపించారు. 'మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యభగవానుడి కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుడిని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాలు మీతో పంచుకుంటున్నాను' అని చిరంజీవి ఓ వీడియోను ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు.

'హనుమాన్‌ జయంతి సందర్భంగా మా పూజా మందిరంలో జరిగిన ఒక విశేషాన్ని మీతో పంచుకోవాలనుకుని ఈ వీడియో చేస్తున్నా. ప్రతి సంవత్సరం డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్త వర్ణాలుగా మారి మా పూజా మందిరంలో ఉన్న హనుమంతుడిని పై నుంచి కింది వరకూ స్పృశిస్తూ ప్రసరించడం చూస్తుంటే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇటీవల మనం అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకాంతి పడి మెరిసిన అద్భుతాన్ని చూశాం. అలాగే కోణార్క్‌, అరసవల్లి దేవాలయాల్లో కూడా సూర్య కిరణాలు భగవంతుడిని తాకే విశేషం అందరికీ తెలిసిందే. అలాంటి దైవానుభూతి మా ఇంట్లోనూ ఆంజనేయుడిని స్పృశించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. అందరికీ హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy