Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mahakali: ప్రశాంత్ వర్మ 'మహాకాళి' కీలక అప్డేట్!

Mahakali: ప్రశాంత్ వర్మ 'మహాకాళి' కీలక అప్డేట్!

Chitrajyothy 1 week ago

'హను-మాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రూపుదిద్దుకుంటోన్న 'మహాకాళి' (Mahakali) మూవీ నుంచి ఓ కీలక అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma), ఆర్కేడీ స్టూడియోస్ కలిసి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీలోకి రోహిత్ సరాఫ్ (Rohit Saraf) ఎంట్రీ ఇచ్చినట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు.. రోహిత్ సరాఫ్ హైదరాబాద్‌లో జరిగిన ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసినట్లుగా మేకర్స్ ఈ అప్డేట్‌లో తెలిపారు.

'లూడో', 'విక్రమ్ వేద' వంటి చిత్రాలతో రోహిత్ సరాఫ్ నటుడిగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇప్పుడీ నటుడి చేరికతో ఈ చిత్రానికి మరింత మైలేజ్ వస్తుందని, మరీ ముఖ్యంగా నార్త్ ఇండియా యువతలో అతనికి ఉన్న ఫాలోయింగ్ 'మహాకాళి' పాన్ ఇండియా రీచ్‌ను మరింత బలోపేతం చేయనుందని టీమ్ భావిస్తోంది. ఇటీవల ప్రశాంత్ వర్మ విషయంలో అనేకానేక వార్తలు వైరల్ అయ్యాయి. అవేమీ పట్టించుకోకుండా, సైలెంట్‌గా ప్రశాంత్ వర్మ తన పని తాను చేసుకుంటున్నాడనే విషయం ఈ అప్డేట్‌తో క్లారిటీ ఇచ్చినట్లయింది.

ఇక 'మహాకాళి' విషయానికి వస్తే.. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, భూమి శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించాయి. పవర్‌ఫుల్, ఇంటెన్స్ లుక్స్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. 'హను-మాన్' విజయానంతరం భారతీయ మూలాలతో కూడిన సినిమా యూనివర్స్‌ని విస్తరించాలనే ప్రశాంత్ వర్మ విజన్‌లో భాగంగా 'మహాకాళి' రూపుదిద్దుకుంటోంది. పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ 'మహాకాళి' అత్యంత ఆసక్తికరమైన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy