Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహేష్ సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది: సుమంత్

మహేష్ సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది: సుమంత్

Chitrajyothy 3 weeks ago

విలక్షణ నటుడు సుమంత్ (Sumanth) కథానాయకుడిగా, రాజేష్ కర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'న్యూటన్స్ థర్డ్ లా' (Newton's 3rd Law).

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఒక ప్రత్యేక చిట్‌చాట్‌లో హీరో సుమంత్ తన మనసులోని ఒక కోరికను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇన్నాళ్లూ కథానాయకుడిగా పలు విభిన్నమైన, పాజిటివ్ పాత్రల్లో మెప్పించిన ఆయన, భవిష్యత్తులో కనుక పూర్తిస్థాయి నెగెటివ్ పాత్ర చేయాల్సి వస్తే ఎవరి సినిమాలో చేయాలనుకుంటున్నారనే ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు.

సుమంత్ స్పందిస్తూ.. ''సూపర్‌స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) సినిమాలో ఆయనకు నెగెటివ్‌గా, పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించాలని ఉంది'' అని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. విలన్‌గా చేయాలంటే మహేష్ బాబుకు ఆపోజిట్‌గా నటిస్తే.. ఆ ప్రాజెక్ట్ చాలా ప్రత్యేకం అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు హీరోగానే అలరించిన సుమంత్ నుంచి ఇలాంటి స్టేట్‌మెంట్ రావడంతో అక్కినేని, ఘట్టమనేని అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అక్కినేని ఫ్యామిలీకి చెందిన అంతమంది హీరోలు ఉండగా.. కేవలం మహేష్ బాబు సినిమాలోనే చేయాలని సుమంత్ చెప్పడంతో.. అది మా హీరో పవర్ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.

ఇక 'న్యూటన్స్ థర్డ్ లా' చిత్రం గురించి చిత్రబృందం మాట్లాడుతూ.. ఈ సినిమాను ఎంతో ఉత్కంఠ భరితంగా, క్లైమాక్స్ హైలైట్ అయ్యేలా తెరకెక్కించినట్లు వెల్లడించారు. కామన్ ఆడియన్స్‌కి నచ్చేలా షార్ప్ స్క్రీన్‌ప్లే, ఆకట్టుకునే ట్విస్ట్‌లతో సినిమా రూపుదిద్దుకుందని, సుమంత్ కథల ఎంపికపై ఉన్న నమ్మకమే ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన బలమని చిత్రబృందం పేర్కొంది. సుమంత్ విలన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి:

యంగ్ టైగర్ వదిలిన 'ఐ యామ్ గేమ్' ట్రైలర్ ఎలా ఉందంటే..

'రామాయణ'లో రణబీర్ కపూర్ ద్విపాత్రాభినయం

పావలా శ్యామల గురించి ఘోరంగా రాశారు.. ఇక ఆపండి: కరాటే కళ్యాణి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy