Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Manchu Manoj: ఆయన్నే అడగండి.. మైక్‌తో వెళ్లకండి.. వెళ్లినా హెల్మెట్‌ పెట్టుకోండి

Manchu Manoj: ఆయన్నే అడగండి.. మైక్‌తో వెళ్లకండి.. వెళ్లినా హెల్మెట్‌ పెట్టుకోండి

Chitrajyothy 5 days ago

మంచు మనోజ్‌ (Manchu Manoj) సంచలన ప్రకటన చేశారు. తన భార్య మౌనిక (mounica) వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి మనోజ్ దంపతులు ఇటీవల ఐక్య సంస్థను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే!

దానిపై ఉన్న పలు సందేహాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 20న పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన ప్రారంభించిన ఐక్య గురించి వివరించారు. 'ఇది రాజకీయ సంస్థ కాదు. దానికి, దీనికి ఏ సంబంధం లేదు. ప్రజల వైపు మాట్లాడే గొంతుకగా ఉండేందుకు ఈ సంస్థను ప్రారంభించాం. దీని కార్యకలాపాల కోసం సొంత నిధులను ఉపయోగించనున్నాం. నా భార్య మౌనిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనుంది. ప్రస్తుతం రాజకీయాల్లో భాగమయ్యాం' అని అన్నారు. మీ తండ్రితో ఉన్న గొడవలు సద్దుకున్నాయా? అన్న ప్రశ్నకు 'అది ఎవరిని అడగాలో మీకు తెలుసు. మైక్‌తో వెళ్లకండి.. వెళ్లినా హెల్మెట్‌ పెట్టుకోండి' అని సరదాగా సంభాషించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy