Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంచు విష్ణు 'కన్నప్ప' రీ రిలీజ్.. ఈ సారైనా?

మంచు విష్ణు 'కన్నప్ప' రీ రిలీజ్.. ఈ సారైనా?

Chitrajyothy 6 days ago

మంచు విష్ణు (Manchu Vishnu) హీరోగా, రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ఓ కీలక పాత్రలో నటించిన 'కన్నప్ప' (Kannappa) చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన ఈ చిత్రం విడుదలై వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై డా. ఎం. మోహన్ బాబు (M Mohan Babu) ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ (రీసెంట్‌గా వచ్చిన అర్జున్ 'బ్లాస్ట్ జోన్' మూవీ ఫేమ్) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. హీరో విష్ణు మంచు తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమాకి తెలుగులో వచ్చిన ఆదరణ, క్లైమాక్స్‌లో విష్ణు నటనకు వచ్చిన ప్రశంసలను దృష్టిలో పెట్టుకుని మరోసారి ఈ విజువల్ వండర్‌ను ఆడియెన్స్‌ ముందుకు తీసుకురాబోతున్నారు. జూన్ 27న 'కన్నప్ప'ని లిమిటెడ్ స్క్రీన్‌లలో రిలీజ్ చేయబోతోన్నట్లుగా తెలుపుతూ.. మేకర్స్ విడుదల చేసిన రీ రిలీజ్ (Kannappa Re Release) డేట్ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

మంచు మోహన్ బాబు ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టిన విషయం తెలిసిందే. సినిమాకు మంచి పేరు, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా, కలెక్షన్ల పరంగా మాత్రం.. ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ అయిన చిత్రాలు భారీగా కలెక్షన్స్‌ను రాబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం.. ఈ రీ రిలీజ్‌లో ఎలాంటి స్పందనను, కలెక్షన్స్‌ను రాబడుతుందో తెలియాలంటే మాత్రం జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. జూన్ 26న విడుదల కావాల్సిన అఖిల్ 'లెనిన్' సినిమా వాయిదా పడటం, మరో సినిమా ఏదీ లేకపోవడం.. 'కన్నప్ప' రీ రిలీజ్‌కు కలిసొచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

'బెంగళూరు నాగరత్తమ్మ'.. సింగీతం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చేదెవరో..

ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్‌ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్

తల్లి కాబోతున్న సమంత..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy