ప్రముఖ హీరో రవితేజ (raviteja) నటించిన ఇరుముడి (Irumudi) సినిమాలో కొన్ని సీన్లు ఉపాధ్యాయులను, ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వెంటనే ఆ సీన్లను తొలగించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి (MLC Borra Gopi Murthy) డిమాండ్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గోపి మూర్తి మాట్లాడుతూ.. సినిమాలు సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలే గానీ సమాజంలో కొన్ని వర్గాలను కించపరిచే విధంగా ఉండకూడదని అన్నారు.
ఇరుముడి సినిమాలో సీలేరు ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాలను నేరుగా చూపించడం, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న బాలికల డ్రెస్ కోడ్ ను చూపించడాన్ని, ఆ పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయురాలిని ప్రతి నాయకురాలిగా క్రూరంగా చూపించడంపై కూడా తాము అభ్యంతర వ్యక్తం చేస్తున్నామని గోపి మూర్తి అన్నారు.
అంతేగాక.. ఎగస్ట్రా క్లాసులు పేరుతో అమ్మాయిలను ఎమ్మెల్యేకు పంపించడం లాంటి సీన్లను చూపించడంపై కూడా తాము అభ్యంతర వ్యక్తం చేస్తున్న మన్నారు. ఈ సీన్లు కారణంగా సమాజంలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారా అనే అపోహలు కూడా ప్రజల్లో తలెత్తుతాయని అన్నారు ఎమ్మెల్సీ గోపి మూర్తి. విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే కల్పించుకుని సినిమాలో ఉన్న అభ్యంతర సీన్లను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఆ సన్నివేశాలు తొలగించాలి: యూటీఎఫ్
ఇరుముడి సినిమాలో ఉపాధ్యాయుల పాత్రను చిత్రించిన తీరును యూటీఎఫ్ ఖండిం చింది. టీచర్లను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని యూటీఎఫ్ అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు గురు వారం డిమాండ్ చేశారు. ఆ సన్నివేశాల కారణంగా ప్రభుత్వ పాఠశాలలు ఇలాగే ఉంటాయి, అక్కడి టీచర్లు ఇలాగే ఉంటా రనే ప్రతికూల భావన ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుముడి సినిమాలో పాఠశాల బోర్డు, విద్యా ర్థుల యూనిఫాం, ఒక ప్రధానోపాధ్యాయురాలిని తప్పుగా చూపించారని ఆష్టా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాకి ప్రకాశ్ రావు, ఎంజీ మెహది విమర్శించారు. ఆ సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మంత్రి లోకేశ్కు లేఖ రాశారు.

