Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mega 158: పవన్‌ కల్యాణ్‌ క్లాప్‌తో మెగా 158 మొదలు..

Mega 158: పవన్‌ కల్యాణ్‌ క్లాప్‌తో మెగా 158 మొదలు..

Chitrajyothy 3 days ago

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) మంచి జోరు మీదున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'మన శంకర వర్రపసాద్‌గారు' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్నారు.

'విశ్వంభర' పూర్తి చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీకాంత్‌ ఓదెలతో ఓ సినిమా కమిట్‌ అయ్యారు. ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య'తో పెద్ద హిట్‌ ఇచ్చిన కె. ఎస్‌. రవీంద్ర (బాబీ కొల్లి)తో 'మెగా158' (Mega 158) చిత్రం చేయనున్నారు. ఈ చిత్రంతో కెవిఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ఎప్పుడో ప్రారంభం కావలసిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. (Pawan Kalyan)

గురువారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హైదరాబాద్‌, అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ వేడుకకు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హాజరయ్యారు. కె. నాగబాబు, అల్లు అరవింద్‌, బి. గోపాల్‌, కె.ఎల్‌. నారాయణ, అశ్వినీదత్‌, కోదండ రామిరెడ్డి, కె.ఎస్‌. రామారావు సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం

తొలి సన్నివేశానికి పవన్‌ కల్యాణ్‌ క్లాప్‌ ఇవ్వగా, వి.వి. వినాయక్‌ గౌరవ దర్శకత్వం వహించారు.

'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత చిరు, బాబీ కాంబోలో రానున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాసీవ్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ప్రేక్షకుల్ని అలరించింది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy