Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మెగా ఛాన్స్ పట్టేసిన ఛాంపియన్ బ్యూటీ.. నక్కతోక తొక్కినట్టుందే

మెగా ఛాన్స్ పట్టేసిన ఛాంపియన్ బ్యూటీ.. నక్కతోక తొక్కినట్టుందే

Chitrajyothy 4 days ago

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరిని అదృష్టం వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కొంతమందికివరుస విజయాలు అందుకున్నా కొన్నిసార్లు ఛాన్స్ లు రావు. మరికొంతమందికి ఒక్క సినిమా చేసినా మెగా ఛాన్స్ వచ్చేస్తోంది.

తాజాగా మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan) రెండో కేటగిరిలో ఉందని చెప్పొచ్చు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

ఛాంపియన్ సినిమాతో అనస్వర తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. రోషన్ హీరోగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను అందుకుంది. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా అనస్వర న్యాచురల్ యాక్టింగ్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అమ్మడికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉంటుందని జోస్యం కూడా చెప్పారు. ఇప్పుడు ఆ జోస్యం నిజమైంది. ఈ చిన్నది తన రెండో సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబోలో వస్తోన్న చిత్రం మెగా 158. కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ ప్రారంభోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొనడం విశేషం. చిరంజీవిపై చిత్రీకరించిన ప్రారంభ సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఇక ఈ చిత్రంలో అనస్వర ఒక కీలక పాత్రలో నటించబోతోంది. అందుతున్నసమాచారం ప్రకారం చిరుకు కూతురిగా ఆమె నటిస్తోందని తెలుస్తోంది. మెగాస్టార్ సినిమాలో ఒక చిన్న పాత్ర చేసినా అది ఈ తరం నటీనటులకు అచీవ్ మెంట్ అని చెప్పొచ్చు. ఎన్నోఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు రాని మెగా ఛాన్స్ రెండో సినిమాకే ఈ మలయాళ బ్యూటీకి దక్కడం నిజంగా ఆమె అదృష్టమని నెటిజన్స్ అంటున్నారు. ఏది ఏమైనా అనస్వర నక్కతోక తొక్కింది అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy