Dailyhunt
మేమేమీ టెర్రరిస్టులం కాదు కదా.. రేణుదేశాయి వీడియో వైరల్‌

మేమేమీ టెర్రరిస్టులం కాదు కదా.. రేణుదేశాయి వీడియో వైరల్‌

Chitrajyothy 1 week ago

రచూ వార్తల్లో నిలుస్తూ, ట్రోల్‌ అవుతున్న రేణు దేశాయ్‌ (Renu Desai) ఇన్‌స్టాగ్రామ్‌లో మరో పోస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా ఫేక్‌ అకౌంట్‌లతో అసభ్యకరంగా మాట్లాడుతున్న వారిపై ఇటీవల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే!

ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియో రిలీజ్‌ చేశారు. వీడియోలో ఆమె ఏమన్నారంటే 'ఎవరైనా క్రైమ్‌ చేస్తుంటే వాళ్లను తిట్టండి. మాలాంటి ఆర్టిస్టులను తిట్టొద్దండి! మేము ఆర్టిస్టులము. మా మనసులు చాలా సున్నితంగా ఉంటాయి. మేమేమీ టెర్రరిస్టులం కాదు కదా? మాపై అసభ్యకరమైన కామెంట్స్‌ ఎందుకు చేస్తున్నారు? మేం నేరాలు చేయట్లేదు కదా! మీకు నా పని నచ్చకపోతే.. నన్ను ఫాలో చేయడం ఆపేయండి. నేనేం పాపం చేశా.. ఇంత అసభ్యంగా తిడుతున్నారు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

రేణు దేశాయ్‌పై అసభ్యపదజాలంతో కామెంట్స్‌ చేసిన ఆరుగురిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని చెబుతూ ఆమె మరో వీడియో విడుదల చేశారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కొద్దిరోజుల క్రితం సమావేశంలో వీధి శునకాల రక్షణ గురించి ఆమె మాట్లాడిన విషయం తెలిసిందే. వంద కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని, వాటితో జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పారు. ఆ పది కుక్కల కోసం మిగతా 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. దాంతో చాలామంది నెటిజన్లు ఆమెపై రెచ్చిపోయి మాట్లాడారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తాజాగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy