Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొహమాటానికి పోయి ఆ సినిమా చేశా: వేణు తొట్టెంపూడి

మొహమాటానికి పోయి ఆ సినిమా చేశా: వేణు తొట్టెంపూడి

Chitrajyothy 1 week ago

వేణు తొట్టెంపూడి (Venu Tottempudi).. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఒకప్పుడు 'స్వయంవరం', 'చిరునవ్వుతో'.. వంటి చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వేణు..

సడెన్‌గా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఏదో బిజినెస్ చూసుకుంటున్నారనేలా వార్తలు వచ్చాయి. మళ్లీ ఆయన మాస్ మహారాజా రవితేజ (Ravi Taja) హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. అందులో వేణు పాత్రకు ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆయనకు రీ ఎంట్రీ అసలు కలిసి రాలేదనే చెప్పుకోవాలి.

వాస్తవానికి ఆయన రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నప్పుడు.. 'రామారావు ఆన్ డ్యూటీ' (Ramarao On Duty) సినిమాలోని పాత్ర కంటే మంచి పాత్ర రావాలని చూశారట కానీ.. ఆ సినిమా దర్శకుడు, నిర్మాత బాగా ఇబ్బంది పెట్టేశారట. అందుకే, ఇష్టం లేకపోయినా, ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పాల్సి వచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ఒక్కోసారి అంతే, మొహమాటానికి పోయి సినిమాలు చేయాల్సి వస్తుంది. అలా చేసినప్పుడు సక్సెస్ వస్తే ఓకే కానీ, పరాజయం ఎదురైతేనే మళ్లీ వెనక్కి అడుగు పడుతుంది. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా విజయం సాధించి ఉంటే.. వేణు ఆ తర్వాత వరసగా సినిమాలలో కనిపించేవారు. కానీ, అది జరగలేదు.

ఇప్పుడు మళ్లీ ఆయన ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమా వివరాలు ఏంటనేది ఇంకా తెలియలేదు కానీ, కచ్చితంగా వేణు ఈసారి సక్సెస్ కొట్టి చూపిస్తానని అంటున్నారు. రవితేజ సినిమాతో ఇచ్చిన రీ ఎంట్రీని పక్కన పెట్టేసి, ఇప్పుడిచ్చేదే అసలైన రీ ఎంట్రీ అని ఆయన అంటున్నారు. చూద్దాం మరి.. ఈ సినిమా అయినా వేణుకి సక్సెస్ ఇచ్చి, మళ్లీ బిజీ నటుడ్ని చేస్తుందేమో..!

ఇవి కూడా చదవండి:

మోదీ 'పొదుపు మంత్రం'.. కమల్ హాసన్ సంచలన ప్రకటన!

Varanasi: 'వారణాసి' కోసం మైత్రీ వేట.. టెంప్టింగ్ ఆఫర్‌!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy