Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MYsaa: రష్మిక మందన్న 'మైసా' వచ్చేది అప్పుడే..

MYsaa: రష్మిక మందన్న 'మైసా' వచ్చేది అప్పుడే..

Chitrajyothy 2 weeks ago

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా'(Mysaa). అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రవీంద్ర పుల్లె ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అజయ్, అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. మైసా ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని విధంగా రష్మిక మందన్నతో కలిసి అనుభవించడానికి సిద్ధంగా ఉండండి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

ఇటీవల రష్మికకు గాయం కావడంతో షూటింగ్‌కు కొంత విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో త్వరలోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారు. రష్మిక సెట్స్‌లోకి అడుగుపెట్టిన తర్వాత షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy