Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'నా పెళ్ళాం నిప్పు రా'.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!

'నా పెళ్ళాం నిప్పు రా'.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!

Chitrajyothy 3 weeks ago

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) తన పెళ్లి వార్తతో అందరినీ ఒక్కసారిగా సర్‌ప్రైజ్ చేశారు. 'నేను నిర్మించిన సామ్రాజ్యం కంటే గొప్పది నాకు దొరికింది..

నా భార్యను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాను'' అంటూ తన అర్ధాంగి కావ్య బెల్లంకొండ (Kavya Bellamkonda) ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇందులో 'నా పెళ్ళాం నిప్పు రా' (NA PELLAM NIPPU RA) అంటూ ఆయన పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కొత్త జంటను చూసి అటు అభిమానులు, ఇటు సినీ ప్రముఖులు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

చాలా కాలంగా సాయి శ్రీనివాస్ పెళ్లి గురించి ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, ఈ యంగ్ హీరో తన జీవిత భాగస్వామిని అధికారికంగా ప్రకటించారు. శ్రీనివాస్-కావ్య జంటను చూస్తుంటే పక్కా 'మేడ్ ఫర్ ఈచ్ అదర్'లా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమాల్లో పవర్‌ఫుల్ యాక్షన్ రోల్స్ చేసే శ్రీనివాస్, రియల్ లైఫ్‌లో ఇంత ఎమోషనల్ అండ్ రొమాంటిక్ పోస్ట్ పెట్టడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ పోస్ట్‌లో 'నా పెళ్ళాం నిప్పు రా' అని పెట్టడానికి కారణం లేకపోలేదు. ఆయన హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక'లో ఈ తరహాలోనే ఓ డైలాగ్ ఉంటుంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ డైలాగ్ వైరల్ అవుతోంది. అదే డైలాగ్‌ని ఈ సందర్భానికి వాడుతూ.. శ్రీనివాస్ చేసిన పోస్ట్‌కు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరో వైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య తిరుమలలో శ్రీవారి సన్నిధిలో వివాహం (Sreenivasakavyanam) చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లో మ్యారేజ్ రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున వంటి వారంతా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి:

తొక్కలో ఇంటర్వ్యూ.. అంటూ కుర్చీ విసిరేసి వెళ్లిపోయిన గెటప్ శ్రీను!

'ఇద్దరి నుంచి ముగ్గురుగా'.. తల్లికాబోతోన్న శ్రీ విష్ణు హీరోయిన్!

'భోగి'లో అనుపమ పరమేశ్వరన్.. ఫస్ట్ లుక్ మాములుగా లేదుగా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy