Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'నాగబంధం'.. వచ్చేస్తోంది

'నాగబంధం'.. వచ్చేస్తోంది

Chitrajyothy 2 days ago

భిషేక్‌ నామా (Abhishek Nama) దర్శకత్వంలో విరాట్‌ కర్ణ (Virat Karrna) హీరోగా రూపుదిద్దుకుంటున్న మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ 'నాగబంధం' (Nagabandham) చిత్రం షూటింగ్‌ పార్ట్ పూర్తయింది .

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌, వీఎఫ్‌ఎక్స్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి హీరో విరాట్‌కర్ణ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. చేతిపై పడగ విప్పిన సర్పం, ఆ చేతిలోనే పదునైన కత్తి, నేపథ్యంలో కనిపించే సముద్ర యుద్ధ వాతావరణం, ట్రైబల్‌ పోరాటాలు.. ఇవన్నీ చిత్రంలోని భారీ స్థాయి యాక్షన్‌ను సూచిస్తున్నాయి.

ఇదిలాఉంటే.. నార్త్‌ ఇండియాలోని అన్ని భాషల థియేట్రికల్‌ రిలీజ్‌ హక్కులను జీ స్టూడియో సొంతం చేసుకుందని నిర్మాతలు కిశోర్‌ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి తెలిపారు. నభా నటేశ్ (Nabha Natesh), ఐశ్వర్య మీనన్‌, జగపతిబాబు, మహేశ్‌ మంజ్రేకర్‌ తదితరులు నటిస్తున్న 'నాగబంధం' చిత్రం జులై 3న విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Chitrajyothy